• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CASE FILED ON LOCOMOTIVE PILOT AFTER TWO ELEPHANTS DIED IN AN ACCIDENT IN ODISHA HERE IS THE FULL DETAILS HSN

అర్ధరాత్రి.. వేగంగా దూసుకొస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న 12 ఏనుగులు.. చివరకు ఏం జరిగిందంటే..

అర్ధరాత్రి.. వేగంగా దూసుకొస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న 12 ఏనుగులు.. చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి. ఓ ఏనుగుల గుంపు రైలు పట్టాలను దాటుతోంది. ఇంతలో ఓ రైలు వేగంగా వచ్చింది. రైలును ఆపుదామని ప్రయత్నిస్తే మొత్తానికే ప్రమాదమని ఆ రైలును నడుపుతున్న లోకోపైలట్ భావించాడు. చివరకు..

  • Share this:
    వేగంగా రైలు దూసుకొస్తోంది. ఇంతలో సడన్ గా ఓ 12 ఏనుగులు పట్టాలను దాటుతుండటాన్ని రైలును నడుపుతున్న లోకో పైలట్ చూశాడు. చూస్తుండగానే రైలు బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఏనుగుల గుంపు ట్రాకును దాటడం పూర్తవలేదు. ఫలితం ఓ రెండు ఏనుగులను రైలు ఢీకొట్టింది. అంతే వేగంతో అక్కడి నుంచి దూసుకెళ్లిపోయింది. అంత వేగంతో వస్తున్న రైలుకు సడన్ బ్రేకులు వేస్తే మొత్తం ట్రైన్ కే ప్రమాదం. గూడ్స్ రైలు కాబట్టి భారీ ఆస్తి నష్టం జరుగుతుందన్నది లోకోపైలట్ వాదన. కానీ ఈ ఘటనలో లోకోపైలట్ పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అటవీ శాఖ అధికారి డిమాండ్ చేస్తున్నారు. ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    రూర్కేలా అటవీ ప్రాంతంలోని మహిపాని గ్రామ పరిధిలో జనవరి 3న అర్ధరాత్రి సమయంలో ఓ రైలు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వస్తున్న ఓ రైలు రెండు ఏనుగులను ఢీకొట్టింది. ఆ సమయంలో దాదాపు 12 ఏనుగులు రైల్వే ట్రాకును దాటుతుండటాన్ని రైలును నడుపుతున్న లోకోపైలెట్ చూశాడు. కానీ వేగంతో వస్తుండటంతో రైలును ఆపితే మరింత ప్రమాదమని ఆపలేదు. ఫలితంగా ఎనిమిదేళ్లు, 12 ఏళ్ల వయసున్న రెండు ఏనుగులు చనిపోయాయి. ఈ ఘటనపై లోకో పైలట్ కృష్ణగోపాల్ పై సుందేర్గాహ్ జిల్లాలోని బిస్రా పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 5న కేసు నమోదయింది.

    ’అటవీ ప్రాంతాలు ఉన్న చోట్ల కేవలం 30 కిలోమీటర్ల వేగంతోనే రైలు నడపాలన్న నిబంధన ఉంది. దీన్ని ఆ లోకోపైలట్ అతిక్రమించాడు. ఆయన 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఫలితంగానే ఆ రెండు అమాయక ప్రాణులు చనిపోయాయి. అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే. రైళ్ల అతివేగం కారణంగా ఈ మధ్య చాలా ఏనుగులు, జంతువులు ప్రమాదాలకు గురయి మరణిస్తున్నాయి.‘ అని అటవీశాఖ ముఖ్య అధికారి బంజా కిషోర్ స్వైన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైల్వే అధికారుల వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ’రైలు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వచ్చినా ఫుల్ ఫోర్స్ తో సడన్ బ్రేకులను వేసినా ఆ రైలు 750 మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాతే ఆగుతుంది. ఉన్నచోటే ఒక్కసారిగా రైలు ఆగదు. ఇలాంటి ఘటనల్లో రైల్వే ఉద్యోగులు కావాలని తప్పిదాలు చేయరు. కళ్లముందు మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపై నిల్చున్నా, తప్పుకోమంటూ అరవడం తప్పితే ఏమీ చేయలేరు. ఒక్క ప్రాణం కోసం ఆలోచిస్తే రైల్లో ఉన్న వేలాది మంది ప్రాణాలకు ప్రమాదం వస్తుంది‘ అని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరి ఈ కేసు ఎంత వరకు వెళ్తుందో వేచిచూడాలి.
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు