CASE FILED ON BHOPAL CONSTABLE FOR RAPING 25 YEARS OLD WOMAN AND PROPOSED TO MARRY HER HSN
ఏడాది నుంచి కానిస్టేబుల్ తో ప్రేమ.. అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆ యువతికి తెలిసి..
(ప్రతీకాత్మక చిత్రం)
త్వరలోనే పెళ్లి చేసుకుందామంటూ ఆమెను నమ్మించాడు కూడా. కానీ, ఏడాది తర్వాత ఆమెకు ఓ నిజం తెలిసింది. అతడికి అప్పటికే పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాడని తెలిసింది. దీంతో..
25 ఏళ్ల ఓ యువతికి ఓ పోలీస్ కానిస్టేబుల్ పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ ఆ కానిస్టేబుల్ చెప్పడంతో ఆమె కూడా సరేనంది. ఇద్దరూ కలిసి సిటీలోని పార్కుల్లోనూ సినిమా థియేటర్లకూ షికార్లు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను అతడు లైంగికంగా కూడా లొంగదీసుకున్నాడు. తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి మరీ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. త్వరలోనే పెళ్లి చేసుకుందామంటూ ఆమెను నమ్మించాడు కూడా. కానీ, ఏడాది తర్వాత ఆమెకు ఓ నిజం తెలిసింది. అతడికి అప్పటికే పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నాడని తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లోని కమలానగర్ ప్రాంతంలో జోగేంద్ర గుర్జార్ అనే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. అతడికి ఏడాది క్రితం ఓ స్నేహితురాలి ద్వారా ఓ 25 ఏళ్ల యువతి పరిచయం అయింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ, త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు చెప్పాడు. ఆమెపై ఏడాది కాలంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి గురించి ఆమె ప్రస్తావించినప్పుడల్లా సమాధానం దాటవేశాడు.
అయితే ఇటీవల ఆమెకు ఓ నిజం తెలిసింది. అతడికి అప్పటికే పెళ్లయిందనీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో తాను మోసపోయానని ఆ యువతి గ్రహించింది. తనను లైంగికంగా వాడుకునేందుకే మాయమాటలు చెప్పాడని నిర్ధారణకు వచ్చింది. జోగేంద్రపై ఆ యువతి కేసు పెట్టింది. ఆమె చెప్పిన వివరాలను బట్టి కేసును నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే అతడిని ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.