వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్‌లపై కేసు పెట్టిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు..

Whatsapp, Twitter, TikTok : వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్ సోషల్ మీడియా సంస్థలకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు షాక్ ఇచ్చారు.

news18-telugu
Updated: February 28, 2020, 3:05 PM IST
వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్‌లపై కేసు పెట్టిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Whatsapp | Twitter | TikTok : వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్ సోషల్ మీడియా సంస్థలకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా గ్రూపుల్లో కొందరు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని శ్రీశైలం అనే జర్నలిస్టు నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో ఆ సంస్థలపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, చట్టాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుదారు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. వాట్సాప్, టిక్‌టాక్, ట్విట్టర్‌లో దుష్ప్రచారం చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కేసు విచారణ చేపట్టిన కోర్టు.. సైబర్ క్రైం పోలీసులకు కేసు బదిలీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఆయా సంస్థలపై కేసు నమోదు చేశారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 28, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading