ఉద్యోగం ఇప్పిస్తానని.. యువతిని వ్యభిచార రొంపిలోకి.. చివరకు ఏం జరిగిందంటే..

తన ఇంటికి సమీపంలో ఉంటున్న ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని పసిగట్టింది. ఆ సాకుతో తనకు ప్రొద్దుటూరులో తెలిసిన వారున్నారని అక్కడికొస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది.

news18-telugu
Updated: May 28, 2020, 8:14 PM IST
ఉద్యోగం ఇప్పిస్తానని.. యువతిని వ్యభిచార రొంపిలోకి.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగితను అసరాగా చేసుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య రోజురోజూకీ ఎక్కువవుతోంది. అయితే యువతుల విషయానికి వచ్చే సరికి ఈ పరిస్థితులు మరింత దారుణంగా ఉంటున్నాయి. ఉద్యోగం పేరుతో అమాయక మహిళలు, యువతులను వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ప్రయ్నతించిందో మహిళ. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం రూరల్ పరిధిలోని పద్మావతి అలియాస్ దస్తగిరమ్మ అనే మహిళ రెండు నెలల కిందట ఓ ఇంట్లో అద్దెకు దిగింది. తన ఇంటికి సమీపంలో ఉంటున్న ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని పసిగట్టింది. ఆ సాకుతో తనకు ప్రొద్దుటూరులో తెలిసిన వారున్నారని అక్కడికొస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. ఇంటిలో ఎవరికీ చెప్పకుండా సదరు అమ్మాయి పద్మావతి వెంట ప్రొద్దుటూరుకు వెళ్లింది. ఈ విషయం తెలియని ఇంటిలో కుటుంబ సభ్యులు తమ అమ్మాయి కన్పించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలావుంటే.. ప్రొద్దుటూరులో ఉద్యోగం చూపిస్తానని తీసుకెళ్లిన పద్మావతి వ్యభిచార వృత్తి చేసుకుంటే.. కావాల్సినంత సంపాదన వస్తుందని అమ్మాయికి ఆశ చూపించింది. తాను అలాంటి పనిచేయనని చెప్పినా.. పద్మావతి వినకుండా ఏలాగైనా ఆ రొంపిలోకి దించేందుకు ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఆ అమ్మాయి ఏలాగోలా తప్పించుకుంది. అప్పటికే లాక్‌డౌన్ అమలులో ఉండడంతో ప్రొద్దుటూరులోనే ఇరుక్కపోయింది. సదరు అమ్మాయి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అనంతపురం తీసుకొచ్చారు. పద్మావతిపై ఉమెన్ ట్రాఫికింగ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు.
First published: May 28, 2020, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading