టీడీపీ నేత, మాజీమంత్రిపై కేసు నమోదు

భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 3, 2020, 12:40 PM IST
టీడీపీ నేత, మాజీమంత్రిపై కేసు నమోదు
సైకిల్ (టీడీపీ గుర్తు)
  • Share this:
వైసీపీ నేత, మచిలీపట్నం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని పోలీసులు నిర్ధారించారు. మోకా భాస్కరరావు హత్యకేసులో చింతా చిన్నీ ప్రధాన నిందితుడు కాగా చింతా నాంచారయ్య, చింతా కిషోర్‌లను గురువారం ఆర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా భాస్కరరావు హత్య మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రోద్భలంతోనే జరిగిందంటూ కుటుంబసభ్యులు ఆరోపించటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతా చిన్నీ, నాంచారయ్య, కిషోర్‌లతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మోకా హత్యకేసుకు సంబంధించి మరింత దర్యాప్తు నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసులో మరి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందని అన్నారు. వైసీపీ నేత హత్య కేసులో టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఆరోపణలు రావడంతో... ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.




First published: July 3, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading