దీపావళి(Diwali) పండుగను అడ్డుపెట్టుకొని ఓ యువకుడు తన వ్యక్తిగత కోపం తీర్చుకున్నాడు. నరకాసురుడి పీడ విరగడం అయిందని అందరూ దీపాలు వెలిగించి టపాసులు పేల్చుకుంటే అతడు మాత్రం ఒక పెద్ద బాక్సులో బాణా సంచా పేలుడు పదార్ధాలు తెచ్చి ఓ అపార్ట్‌మెంట్(Apartment)ముందు పేల్చాడు. సరిగ్గా అందులోని రాకెట్ బాంబులు అపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లేలా ఎదురుగా నిల్చొని పట్టుకొని మరీ పేల్చాడు. మహరాష్ట్ర(Maharashtra)ముంబైలోని థానే(Thane) ప్రాంతంలో ఈ సంఘటన సోమవారం(Monday)దీపావళి రోజున చోటు చేసుుకుంది. అతడు ఉద్దేశ పూర్వకంగా ఈ విధంగా టపాసులు కాల్చుతుంటే కొందరు వీడియో(Video)తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వైరల్(Viral)అయింది.
పోకిరి చేష్టలు ...
మహరాష్ట్ర రాజధాని థానే జిల్లాలో దీపావళి రోజున ఓ పోకిరి వెదవ చేసిన తప్పుడు పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీవాలి సందర్భంగా అందరూ క్రాకర్స్ కాల్చుతుంటే ఆ వ్యక్తి మాత్రం థానేలోని ఓ అపార్ట్‌మెంట్ ముందు నిలబడి ఓ బాక్సులో రాకెట్ టపాసులను పేల్చాడు. అయితే ఆ రాకెట్ బాంబులు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లేలా ఓ పథకం ప్రకారం పేల్చాడు. రాకెట్ టపాసులు అపార్ట్మెంట్ వైపు దూసుకొస్తుంటే అందులోని వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే సదరు పోకిరి వెదవ చేసిన చేష్టలను ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈవీడియో వైరల్ అయింది.
ठाण्यात तरुणाने लोकांच्या घरात सोडले रॉकेट्स; पोलिसांकडून शोध सुरू. pic.twitter.com/OWrY6dNqc6
— News18Lokmat (@News18lokmat) October 24, 2022
మూడు సెక్షన్ల కింద కేసులు..
దీపావళి రోజున క్రాకర్స్ పేల్చిన వ్యక్తిపై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. సమాజంలో ఇలాంటి ఉద్దేశ పూర్వక ప్రమాదాలు సృష్టించే వాళ్లను వదిలిపెట్టమని థానే పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితుడిపై థానేలోని ఉల్హాస్‌నగర్ పోలీసులు సెక్షన్ 285, 286, 336 కింద కేసు నమోదు చేశారు. అతడ్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
ఎందుకు చేశాడంటే..
అయితే వైరల్ అవుతున్న వీడియో చూస్తే కచ్చితంగా యువకుడు కావాలనే రాకెట్‌లను అపార్ట్‌మెంట్ వైపుకు వెళ్లేలా కాల్చినట్లుగా తెలుస్తోంది. వీడియో ఆధారంగా థానేలోని అన్నీ పోలీస్ స్టేషన్‌లకు ఈవీడియోని షేర్ చేసి నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకోసం ఇలా చేశాడు..? ఎవరిపైన అయినా కోపంతో చేశాడా అనే విషయాన్ని రాబడతామని థానే పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2022, International news, Maharashtra, Viral Video