CASE AGAINST GOOGLE CEO IN MUMBAI FOR COPYRIGHT ACT VIOLATION PVN
Google CEO సుందర్ పిచాయ్ పై కేసు నమోదు
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(ఫైల్ ఫొటో)
Case Against Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద సుందర్ పిచాయ్ తో పాటు సంస్థలోని మరో ఐదుగురు అధికారులపై ముంబై పోలీస్ స్టేషన్ లో బుధవారం కేసు నమోదు చేసింది.
Google's Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద సుందర్ పిచాయ్ తో పాటు సంస్థలోని మరో ఐదుగురు అధికారులపై ముంబై పోలీస్ బుధవారం కేసు నమోదు చేసింది.
ప్రముఖ సినిమా డైరక్టర్ సునీల్ దర్శన్... 2017లో తాను తీసిన "ఏక్ హసీనా తి ఏక్ దివానా థా" సినిమాను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులను గూగుల్ అనుమతించిందని కోర్టుని ఆశ్రయించారు . ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు గూగుల్ సీఈవో సహా మరో ఐదుగురు సంస్థ అధికారులపై ఈస్ట్ అంథేరిలోని MIDC పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.
సునీల్ దర్శన్ తరఫు న్యాయవాది ఆదిత్య చితాలే మాట్లాడుతూ... "ఏక్ హసీనా తి ఏక్ దివానా థా సినిమా మేధో సంపత్తి హక్కులు( Intellectual property rights)సునీల్ దర్శన్‌కు చెందినవి. ఇది విలువైన మరియు ఖరీదైన వస్తువు. దానిని వాణిజ్యపరంగా ఎలా ఉపయోగించాలనే నిర్ణయం పూర్తిగా,ప్రత్యేకంగా
సునీల్ దర్శన్ కే ఉంటుంది. దర్శన్ కు సంబంధించిన కంటెంట్‌ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి ఎవరికీ ఎలాంటి హక్కు లేదా అధికారం లేదా అనుమతి లేదా లైసెన్స్ మొదలైనవి లేవు. ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా యొక్క ఆడియో-విజువల్స్ మరియు ఆడియోను కొంతమంది యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడానికి అనుమతించడం ద్వారా, యూట్యూబ్ మరియు దాని అధికారులు ఆ సినిమా యొక్క ఆడియో-విజువల్స్ యొక్క మార్కెట్ సామర్థ్యాన్ని మరియు మేధో సంపత్తి హక్కుల విలువను గణనీయంగా తగ్గించారు.
ఏక్ హసీనా తి ఏక్ దివానా థా ఆడియో,ఆడియో విజువల్స్ ప్రదర్శన ద్వారా ప్రకటనలు మరియు ఇతర వనరుల ద్వారా భారీ ఆదాయాన్ని యూట్యూబ్ అన్యాయంగా అర్జించింది. దీంతో దర్శన్ కు మొదట్లో పోలీసులను ఆశ్రయించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కోర్టు ఆదేశాల మేరకు కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 51,63,69కింద MIDC పోలీస్ స్టేషన్ లో గూగుల్ సీఈవో సహా మరో ఐదుగురు సంస్థ అధికారులపై జనవరి 25న కేసు నమోదుచేయబడింది" అని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.