Video:తాగునీటి ట్యాంకర్‌లో కాళ్లు కడిగిన డ్రైవర్‌పై కేసు..

జలమండలి ట్యాంకర్‌లోకి నీరు నింపేందుకు జూబ్లీహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఇప్పటికే యాక్చుయేటర్ అనే ఆటోమెటిక్ సాంకేతికను ట్రయల్ బేసిన్‌పై అందుబాటులోకి తెచ్చారు.

news18-telugu
Updated: July 4, 2020, 10:25 AM IST
Video:తాగునీటి ట్యాంకర్‌లో కాళ్లు కడిగిన డ్రైవర్‌పై కేసు..
ట్యాంకర్‌లో నీళ్లు పడుతూ కాళ్లు కడుగుతున్న డ్రైవర్
  • Share this:
అది జలమండలి పరిధిలోని మూసాపేట్ ఫిల్లింగ్ స్టేషన్. అక్కడికి ట్యాంకర్‌లోకి మంచినీళ్లు నింపుకునేందుకు ఓ డ్రైవర్ ట్యాంకర్‌ను తీసుకొచ్చాడు. ఆ ట్యాంకర్‌లో నీళ్లు నింపే సమయంలో డ్రైవర్ ట్యాంకర్‌లోనే తన కాళ్లు కడుకున్నాడు. అసలే కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్ననేపథ్యంలో డ్రైవర్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో జలమండలి అధికారులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయ్యింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు చెప్పారు. ఇదిలావుంటే.. జలమండలి ట్యాంకర్‌లోకి నీరు నింపేందుకు జూబ్లీహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఇప్పటికే యాక్చుయేటర్ అనే ఆటోమెటిక్ సాంకేతికను ట్రయల్ బేసిన్‌పై అందుబాటులోకి తెచ్చారు.

ఈ విధానం వల్ల సిబ్బంది అవసరం లేకుండానే ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఆధారంగా సెన్సారులు వినియోగిస్తారు. దీనివల్ల ఎటువంటి సిబ్బంది జోక్యం లేకుండా ట్యాంకరులోకి నీరు చేరుతుందని అధికారులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద కొత్త సాంకేతికత పనితీరు ఆధారంగా మరో రెండు నెలల్లో జలమండలి పరిధిలోని అన్నిట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రాల్లో యాక్చుయేటర్ సాంకేతికను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 10:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading