‘కండోమ్స్ తీసుకెళ్లండి... రేప్ చేయించుకోండి..’ సినీ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు...

రేప్‌ను ప్రభుత్వాలు లీగల్ చేస్తే... అప్పుడు హత్యలు జరగబోవని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. తన ఫేస్ బుక్ పోస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేసిన డానియల్ ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు.

news18-telugu
Updated: December 4, 2019, 3:42 PM IST
‘కండోమ్స్ తీసుకెళ్లండి... రేప్ చేయించుకోండి..’ సినీ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు దిశపై జరిగిన హత్యాచార ఘటనకు దేశం మొత్తం అట్టుడికి పోతోంది. నిందితులను బహిరంగంగా ఉరితీయాలంటూ దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తోంది. అయితే, దేశంలో అత్యాచార ఘటనలపై సినీ నిర్మాత, దర్శకుడిగా చెప్పుకొనే డానియల్ శ్రవణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు రేప్‌ను ప్రభుత్వాలు లీగల్ చేస్తే... అప్పుడు హత్యలు జరగబోవని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. తన ఫేస్ బుక్ పోస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేసిన డానియల్ ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. అయితే, అప్పటికే అతడి వ్యాఖ్యల మీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

డానియల్ శ్రవణ్, దర్శకుడు


తన ఫేస్ బుక్‌ ఖాతాలో అతడు రాసిందిదే..

‘హత్య లేని అత్యాచారాన్ని న్యాయసమ్మతం చేస్తూ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకురావాలి. (అంటే రేప్ తర్వాత చంపకుండా ఉంటారు.) 18 ఏళ్ల వయసు పైబడిన యువతులకు రేప్ గురించి అవగాహన కల్పించాలి. (మగాళ్లు శారీరకంగా కోరితే వద్దనకూడదని చెప్పాలి.). అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. వీరప్పన్‌ను చంపితే స్మగ్లింగ్ ఆగుతుందని, బిన్ లాడెన్‌ను అంతం చేస్తే టెర్రరిజం అంతమైపోతుందని అనుకోవడం భ్రమ. నిర్భయ చట్టం కూడా అత్యాచారాలను అంతం చేయలేదు. ముఖ్యంగా భారతీయ యువతులు అత్యాచారం గురించి అవగాహన పెంచుకోవాలి. (వారు తమ వెంట కండోమ్ తీసుకెళ్లాలి.). మగాళ్లు కోరిన వెంటనే ఓకే అంటే వాళ్లు చంపరు. సమాజం, మహిళా సంఘాలు అందరూ కలసి యువతులను పెప్పర్ స్ప్రే తీసుకెళ్లాలని, నిందితులను నిర్భయ చట్టం కింద శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, మగాళ్లు మాత్రం తమ శారీరక వాంఛను తీర్చుకోవడానికి చంపాలని చూస్తున్నారు. ఆడవాళ్లు మగాళ్ల సెక్స్‌ను అంగీకరించడం బెస్ట్.’ అని పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ మీద పెను దుమారం రేగడంతో డానియల్ దీన్ని డిలీట్ చేశాడు. అనంతరం మరో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చేసినందుకు తాను బాధపడుతున్నానని, ఇలాంటిది రిపీట్ కాదని చెప్పాడు. అయితే, తాను తీయబోయే సినిమాలో విలన్ డైలాగ్‌ను తాను పోస్ట్ చేశానని చెప్పాడు. అయితే, దీన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. దీనికి క్షమాపణ చెబుతున్నానన్నాడు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నాడు.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>