హోమ్ /వార్తలు /క్రైమ్ /

పసిపిల్లపై కేర్‌టేకర్ దాష్టీకం..గుజరాత్‌లో ఆమె చేసిన ఘోరం తెలిస్తే షాక్..

పసిపిల్లపై కేర్‌టేకర్ దాష్టీకం..గుజరాత్‌లో ఆమె చేసిన ఘోరం తెలిస్తే షాక్..

Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG: చిన్న పిల్లల ఆలనా, పాలనా చూసుకోమని కేర్‌ టేకర్‌ని పెట్టుకుంటే ఆ మహిళ పిల్లల్ని చిత్రహింసలకు గురి చేసింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. సీసీ ఫుటేజ్లో మహిళ చేసిన నేరం బయటపడటంతో కేర్‌ టేకర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇంకా చదవండి ...

గుజరాత్‌(Gujarat)లో ఓ కేర్‌ టేకర్‌ పైశాచికత్వం వెలుగులోకి వచ్చింది. పొత్తిళ్లలో ఉన్న 8నెలల పసిబిడ్డ(8 Month old baby)ను చావబాదుతూ తన కోపాన్ని, అసహనాన్ని వెళ్లగక్కింది. పిల్లల ఆలనా, పాలనా చూస్తుందని పసిబిడ్డ తల్లి ఆమెకు అప్పగిస్తే ఈవిధంగా చిత్రహింసలు పెట్టి యజమానికి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. పసిబిడ్డను చిత్రహింసలు పెట్టిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. గుజరాత్‌లోని సూరత్‌(Surat)లో ఈ అమానుష ఘటన జరిగింది. రాందర్‌ (Ramdhar)లోని పాలన్‌పూర్‌ పాటియా హిమగిరి సొసైటీలో నివాసముంటున్న ఓ ఉపాధ్యాయురాలికి కవల పిల్లలు ఉన్నారు. ఉద్యోగం కారణంగా వారిని చూసుకోవడం వీలు కుదరకరపోవడంతో కోమల్‌ రవి తంద్లేకర్‌( Komal Tandelkar)అనే మహిళను కేర్‌ టేకర్‌(Caretaker)ని పెట్టుకుంది. పసిబిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటుందని భావించారు ఆ కవల పిల్లల తల్లిదండ్రులు. అయినప్పటికి పని వాళ్లపై నమ్మకం లేకో..ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. పసివాళ్లను చూసుకునేందుకు వచ్చిన మహిళ ఓ రోజు 8నెలల( 8Month-old baby)వయసున్న ఇద్దరు పిల్లల్లో ఒకరిపై తన ఆక్రోశాన్ని ప్రదర్శించింది. ఒక బిడ్డను మంచంపై పడుకుంటే ..మరో బిడ్డను చేతుల్లోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసింది. చెవులు మెలిపెట్టడం, చెంపలపై కొట్టడం, చేతి గోర్లను కొరకడం, పసిబిడ్డను మంచంపై విసిరిపడేస్తూ 5-6 నిమిషాల (5-6minutes)పాటు పసికందును దారుణంగా కొట్టింది కేర్‌టేకర్. దారుణమైన విషయం ఏమిటంటే కేర్‌ టేకర్‌ కొట్టిన దెబ్బలకు, పెట్టిన చిత్రహింసలకు పసికందు స్పృహ తప్పి పడిపోవడంతో అప్పుడు కేర్‌ టేకర్‌ తల్లిదండ్రులకు సమాచారం చేరవేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో కేర్‌ టేకర్‌ కొట్టిన దెబ్బలకు చిన్నారి తలలో మెదడు దెబ్బతిన్నట్లుగా వైద్యులు తెలిపారు.

మనిషి రూపంలో ఉన్న రాక్షసి..

పసిపిల్లల ఆలన, పాలన చూస్తుందని నియమించిన కేర్‌ టేకర్‌ కనికరం లేకుండా ప్రవర్తించింది. ఈ విషయాన్ని బిడ్డ తల్లిదండ్రులు సీసీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో బయటపడింది. వెంటనే బాధిత పసికందు తండ్రి మితేష్‌ పటేల్ రాందర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేర్‌ టేకర్‌ మహిళపై ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజ్ ఆధారంగా చేసుకొని పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేశారు. పసిబిడ్డల తండ్రి మితేష్‌ పటేల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా..తల్లి ఐటీైలో ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్లే పిల్లల్ని చూసుకోలేక మూడు నెలల క్రితమే మహిళ కేర్‌ టేకర్‌ని నియమించుకున్నారు.



పసిపిల్లలపై ఆక్రోశం..

నెలల పసికందును మహిళా కేర్ టేకర్ కొట్టడంతో చిన్నారికి మెదడులో రక్తస్రావం అయినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెపై రాందర్‌ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పసికందును మెరుగైన వైద్యం కోసం పిల్లల డాక్టర్లకు చూపించారు. పసిబిడ్డల ఆలనా, పాలనా బయటి వ్యక్తులకు అప్పగిస్తే ఎలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని తల్లదండ్రులు గ్రహించాలని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాధ్యురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

First published:

Tags: Gujarat, Viral Video

ఉత్తమ కథలు