Home /News /crime /

CARELESS DRIVER LETS A GIRL STUDENT DRIVE A BUS FULL OF PASSENGERS IN JAMMU KASHMIR UDHAMPUR VEHICLE SEIZED

Viral Video: కొంప ముంచిన డ్రైవర్ అత్యుత్సాహాం.. మైనర్ బాలిక చేతికి బస్ స్టీరింగ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

బస్సు నడుపుతున్న బాలిక

బస్సు నడుపుతున్న బాలిక

Careless Driver: ఒక డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. ఏమాత్రం డ్రైవింగ్ అనుభవం లేని మైనర్ బాలికకు స్టీరింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Careless Driver Lets A Girl Student Drive a Bus: జమ్ముకశ్మీర్ లోని ఉదయంపుర్ లో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఒక బస్సు ప్రయాణికులతో నిండుగా ఉంది. ఈక్రమంలో ఒక మైనర్ బాలిక .. బస్సు నడుపుతానని డ్రైవర్ కు చెప్పింది. దీంతో అతను ఆమెకు స్టీరింగ్ అప్పగించాడు. ఆమె కాసేపు స్టీరింగ్ పట్టుకుని బస్సు నడిపింది. కానీ ఆమె నడపడటాన్ని తోటి ప్రయాణికులు తమ ఫోన్ లో రికార్డు చేశారు. ఉదంపూర్-లాండర్ మార్గంలో నడుస్తున్న బస్సును పంచైరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి నడిపింది. బాలిక స్టీరింగ్ పట్టుకుని ఉండగా, ఆమె పక్కనే కూర్చున్న బస్సు డ్రైవర్ ఆమెకు వాహనం నడపడం నేర్పిస్తూ కనిపించాడు.

బస్సులో  పాఠశాల విద్యార్థులతో పాటు,  ప్రయాణికులతో నిండి ఉంది. మార్గం కొండ ప్రాంతం కావడంతో అనుభవం లేని వ్యక్తి బస్సు నడపడం అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వ బస్సు ఉదంపూర్-లాండర్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో.. దానిలో స్థానిక బాలిక బస్సును డ్రైవింగ్ చేస్తానని డ్రైవర్ ను కోరింది. ఆమె పంచైరిలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుకుంటుంది. దీనికి డ్రైవర్ కూడా అంగీకరించాడు. ఆమె డ్రైవర్ సీటులో కూర్చొని స్టీరింగ్ ను హ్యాండిల్ చేసింది. కొంత దూరం బస్సును నడిపింది.





ఆ తర్వాత.. స్టీరింగ్ తన చేతిలో తీసుకున్నారు.  ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు డ్రైవర్ పై సీరియస్ అయ్యారు. బస్సు  కొండ ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. ఒక వేళ బాలిక నడిపేటప్పుడు ఏదైన ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రయాణికులు అతడిని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో స్థానిక ఆర్టీఏ అధికారులు దీనిపై సీరియస్ అయ్యారు. ఒక వేళ చిన్న పొరపాటు కూడా ప్రయాణికులతో నిండిన బస్సు వందల అడుగుల లోయలో పడిపోయేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బస్సు డ్రైవర్ పై చర్యలకు ఉపక్రమించారు. దీనిపై, ARTO ఉదంపూర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ.. డ్రైవర్ అమ్మాయికి బస్సు నడపడం నేర్పిస్తున్నాడని, ఇది ప్రమాదకరమైన ప్రవర్తన అని క్లిప్ లో స్పష్టంగా కనపడుతుంది. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు బస్సు నంబర్ JK14G-2734 ఇప్పుడు సీజ్ చేయబడింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బస్సు డ్రైవర్ లైసెన్స్, పర్మిట్‌లను కూడా రవాణా శాఖ సస్పెండ్ చేసింది.

ఉధంపూర్‌లోని మోటారు వాహన విభాగం వేగంగా చర్యలు తీసుకుంది. అదే విధంగా, ప్రమాదకరమైన డ్రైవింగ్ కోసం, మానవ ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. ఇది మోటారు వాహన చట్టానికి విరుద్ధమైనదని స్థానిక అధికారి తెలిపారు. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రూట్‌ పర్మిట్‌ సస్పెన్షన్‌ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. బస్సు డ్రైవర్‌ను పిలిపించి విచారించనున్నారు. పత్రాలు లేకుండా తిరుగుతున్నందుకు అదే మార్గంలో మరో వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు అధికారి తెలిపారు. డ్రైవర్లందరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు. సరైన పత్రాలు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Buses, Drivers, Jammu and Kashmir

తదుపరి వార్తలు