తమిళనాడులో రూ.4కోట్ల డబ్బు, బంగారంతో పట్టుబడ్డ ఏపీ మంత్రి కారు..

బాలినేని శ్రీనవాసరెడ్డి స్టిక్కర్‌తో ఉన్న కారులో దొరికిన నగదు బ్యాగ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి 'స్టిక్కర్‌తో ఉన్న కారు తమిళనాడులో పట్టుబడింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ మంత్రి 'స్టిక్కర్‌తో ఉన్న కారు తమిళనాడులో పట్టుబడింది. అందులో రూ.4కోట్ల నగదు, కొంత బంగారం ఉన్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్, అటవీ - పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం చెక్ పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో రూ.4 కోట్ల నగదు, కొంత బంగారం లభించింది. ఈ కారు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

  ఈ ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో న్యూస్ 18 మాట్లాడింది. ఆ డబ్బులకు, ఆ కారుకు తనకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ కారు మీద ఉన్న స్టిక్కర్ జిరాక్స్ తీసి అంటించి ఉందన్నారు. అది తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉందని, ఆ డబ్బు తనది కాదని స్పష్టం చేశారు. తనకు అసలు సంబంధమే లేదన్నారు.

  అయితే, కారులో ఒంగోలుకు చెందిన వారు ఉండడం వల్ల ఒంగోలు ఎమ్మెల్యేది అయి ఉంటుందని మీడియా సందేహపడుతోందన్నారు. దీనిపై పూర్తిగా విచారణ జరపొచ్చని బాలినేని చెప్పారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: