హోమ్ /వార్తలు /క్రైమ్ /

Karimnagar : కరీంనగర్‌లో కారు బీభత్సం.. రోడ్డుపక్కన కూలీలను తొక్కేసుకుంటూ.. నలుగురు దుర్మరణం..

Karimnagar : కరీంనగర్‌లో కారు బీభత్సం.. రోడ్డుపక్కన కూలీలను తొక్కేసుకుంటూ.. నలుగురు దుర్మరణం..

కరీంనగర్ జిల్లా కేంద్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి..

కరీంనగర్ జిల్లా కేంద్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ సిటీలోని ప్రఖ్యాత కమాన్ చౌరస్తా సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. రోడ్డుపక్కన జీవనం సాగించే సీస కుమ్మరులపైకి దూసుకుపోయింది. కారు బలంగా ఢీకొట్టి, దాని చక్రాలకింద నలిగిపోయి నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి  గాయాలయ్యాయి. కమాన్ చౌరాస్తా సమీపంలోని రెడ్డి స్టోన్ వద్ద ఈ ఘటన జరిగింది.

కరీంనగర్ సిటీలో కారును అడ్డగోలుగా నడిపి వ్యక్తి బీభత్సం సృష్టించాడు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన సీస కమ్మరి వృత్తి చేసుకునే వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో చనిపోయిన నలుగురూ మహిళలే కావడం గమనార్హం. గాయపడ్డ మరో ముగ్గురిని సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Railway Tracks Fire: రైలు పట్టాలకు మంటలు పెడుతున్నారు..బండ్లు తిరగాలంటే అదొక్కటే దారి!

ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూ నిర్వహించారు. ఇరుక్కుపోయిన కారును క్రేన్ తో బయటికి లాగి, గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

First published:

Tags: Accident, Karimnagar

ఉత్తమ కథలు