హోమ్ /వార్తలు /క్రైమ్ /

దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు.. పరిస్థితి విషమం

దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొట్టిన కారు.. పరిస్థితి విషమం

దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు

దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు

గురువారం వ్యక్తిగత పని మీద జక్లేర్‌కు వెళ్లిన కుర్మయ్య..తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నారాయణ్ పేట్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో బైక్‌ను ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిశా కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో చెన్నకేశవులు తండ్రి బైక్‌పై వెళ్తున్నారు. దిశ కేసులో ఏ1 నిందితుడు ఆరిఫ్ గ్రామం జక్లేర్. ఇక జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు గ్రామం గుడిగుండ్ల. గురువారం వ్యక్తిగత పని మీద జక్లేర్‌కు వెళ్లిన కుర్మయ్య..తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నవంబరు 27న పశు వైద్యురాలు దిశ (పోలీసులు పెట్టిన పేరు)పై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురూ చనిపోయారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు కావడంతో అంత్యక్రియల ప్రక్రియ ఆలస్యమైంది. ఎన్‌కౌంటర జరిగిన 17 రోజులు తర్వాత డిసెంబరు 23న నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు.

First published:

Tags: Disha accused Encounter, Disha Act, Disha murder case, Telangana

ఉత్తమ కథలు