హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Video: ఓవర్ స్పీడ్‌గా వెళ్తున్న కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ .. డ్రైవర్‌ ఏం చేశాడో ఈ వీడియో చూడండి

Shocking Video: ఓవర్ స్పీడ్‌గా వెళ్తున్న కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ .. డ్రైవర్‌ ఏం చేశాడో ఈ వీడియో చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Shocking Video: ఇండోర్‌లో ఓ కారు డ్రైవర్‌ స్పీడ్ డ్రైవింగ్‌తో పోలీసులను భయపెట్టాడు. సిగ్నల్ దగ్గర అడ్డుకోబోయిన ట్రాఫిక్ పోలీస్‌ను తన వాహనంతో ఢీకొట్టుకొని పారిపోతుండగా చేజ్ చేసి పట్టుకున్నారు. ఇంతకి అతని కారులో ఏం దొరికాయో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Indore, India

ఓవర్ స్పీడ్, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్ చేసే వాళ్లు, సిగ్నల్స్‌ క్రాస్ చేసే వాళ్లతో పాటు కార్లలో ఆయుధాల సరఫరా వంటి వాటిని అరికట్టడానికి మధ్యప్రదేశ్ (Madhya Pradesh)పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే తనిఖీల్లో భాగంగానే ఇండోర్‌(Indore)లో ఓ కారు సిగ్నల్ దగ్గరకు ఓవర్ స్పీడుOver speedతో రావడంతో ట్రాఫిక్ పోలీస్‌ అడ్డుకున్నాడు. కారు(Car)కు అడ్డుగా నిలబడి వాహనాన్ని పక్కకు తీసుకోమని చెబుతుండగానే కారులోని వ్యక్తి ట్రాఫిక్‌ పోలీస్‌ని బ్యానట్‌పై పడేలా వేగంగా ముందుకుపోనిచ్చాడు. కారు యజమాని చేసిన పనికి ట్రాఫిక్ పోలీస్ బ్యానట్‌పైనే వేలాడుతున్నా పట్టించుకోకుండా రోడ్డు దాటించే ప్రయత్నం చేశాడు.

OMG: అర్దరాత్రి గర్ల్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బావిలో దూకాడు .. తర్వాత ప్రియుడి పరిస్థితి ఏమైందో ఈ వీడియో చూడండి

ట్రాఫిక్‌ పోలీస్‌ని ఢీకొట్టిన కారు..

ఇండోర్‌లోని విజయ్ నగర్, లసుడియా ఏరియాలో ఓ కారు డ్రైవర్‌ నడిరోడ్డుపై భయబ్రాంతులకు గురి చేసాడు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్య సాయి క్రాస్‌రోడ్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అదే టైమ్‌లో ఓ లగ్జరీ కారు డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో సిగ్నల్ దగ్గరున్న ట్రాఫిక్ పోలీసు ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ఆపడానికి బదులుగా, అతను తన వాహనాన్ని అత్యంత వేగంతో నడపడం ప్రారంభించాడు. దీంతో కారును అడ్డుకునేందుకు ముందు నిల్చున్న శివ్ సింగ్ అనే ట్రాఫిక్ పోలీస్ బానెట్‌పై వాలిపోయాడు. ఇంత జరిగినా కారు డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా సిగ్నల్ దాటించే ప్రయత్నం చేశాడు.

ర్యాష్ డ్రైవింగ్‌తో రచ్చ..

కారు డ్రైవర్ చేసిన దురుసు ప్రవర్తనను అఢ్డుకునేందుకు మరికొందరు పోలీసులు అతడ్ని వెంబడించారు. చివరకు ట్రాఫిక్ సుబేదార్ సురేంద్ర సింగ్ బుల్లెట్ కారుతో కారుని వెంబడించాడు. దేవాస్ నాకా కూడలిలో తన బుల్లెట్‌ను కారు పోలీస్‌ని ఢీకొట్టిన కారు ముందు అడ్డుగా పెట్టినప్పటికి తప్పించుకునేందుకు కారును ఢీకొట్టాడు డ్రైవర్. తర్వాత ట్రాఫిక్ పోలీసులు, అర్బన్ పోలీస్ స్టేషన్ వారు కలిసి లాసుడియా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై ట్రక్కును ట్రాప్ చేసి, ట్రాఫిక్‌ను తగ్గించి కారును పట్టుకున్నారు.

కారులో ఆయుధాలు..

ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ట్రాఫిక్ పోలీసుల వాహనాల్ని ఢీకొట్టిన కారులో ఆయుధాలు కూడా లభించాయని పోలీసులు పరిశీలిస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తికి ఆయుధాల లైసెన్స్‌ ఉన్నప్పటికి అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడంటున్నారు. అయితే ఈ లైసెన్స్ చెల్లుబాటులో ఉందా లేక లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్‌ పోలీసును ఢీకొని కారుతో బీభత్సం సృష్టించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. కారు డ్రైవర్ గ్వాలియర్ నివాసిగా తేల్చారు పోలీసులు. ఎందుకు ఇండోర్ వచ్చాడు అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

First published:

Tags: Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు