నర్సుపై డ్రైవర్ అత్యాచారం... ఫోటోలు పెడతానంటూ...

ఇంట్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే మీ అన్నను చంపేస్తానంటూ బెదిరించాడు.

news18-telugu
Updated: September 30, 2019, 11:14 AM IST
నర్సుపై డ్రైవర్ అత్యాచారం... ఫోటోలు పెడతానంటూ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. విజయవాడలో ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొవ్వకు చెందిన ఓ యువతి విజయవాడలో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. అన్నయ్యతో కలిసి గుణదలలో నివసిస్తోంది.

అయితే కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్‌ అనే వ్యక్తి యువతిపై అత్యాచారం జరిపాడు. గత నెల నాల్గోతేదీన ఇంట్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే మీ అన్నను చంపేస్తానంటూ బెదిరించాడు. అంతేకాదు ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఈనెల 26న చనిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమె ప్రాణాల్ని కాపాడారు. దీంతో రంగలోకి దిగిన పోలీసులు యువతి ఫిర్యాదుతో నిందితుడు వినోద్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వినోద్‌ కోసం గాలిస్తున్నారు.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు