మాజీ ఎంపీ జేసీ సొమ్ము చోరీ... దొంగ ఎవరంటే...

కొద్దిరోజుల క్రితం విజయవాడ వచ్చిన ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి డబ్బు చోరీకి గురైంది.

news18-telugu
Updated: October 14, 2019, 3:11 PM IST
మాజీ ఎంపీ జేసీ సొమ్ము చోరీ... దొంగ ఎవరంటే...
జేసీ దివాకర్ రెడ్డి(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: October 14, 2019, 3:11 PM IST
సీనియర్ రాజకీయ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆయన కారు డ్రైవర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 11న విజయవాడ వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి...ఓ హోటల్‌లో బస చేశారు. సొంత పని మీద కారులో సచివాలయానికి వెళ్లి తిరిగి హోటల్‌కు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి... కారులో ఉన్న సూట్‌కేసు తీసుకువచ్చి గదిలో పెట్టమని కారు డ్రైవర్‌ గౌతమ్‌ను ఆదేశించారు. జేసీ ఆదేశాల మేరకు డ్రైవర్‌ సూట్‌ కేసు తీసుకొచ్చి ఆయన రూమ్‌లో పెట్టి వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తరువాత తన సూట్ కేసు తెరిచి చూసుకున్న జేసీ దివాకర్ రెడ్డికి... అందులోని రూ. 6 లక్షల రూపాయలు కనిపించలేదు.

దీంతో తన సొమ్ము చోరీ అయిన విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే క్రైం డీసీపీ కోటేశ్వరరావుకు ఈ విషయమై సమాచారం అందించారు జేసీ దివాకర్ రెడ్డి. కారులోంచి డ్రైవర్‌ సూట్‌ కేసు తెచ్చాడని తెలుసుకున్న పోలీసులు డ్రైవర్‌ గౌతమ్‌ను విచారించారు. నగదును అపహరించానని అంగీకరించిన డ్రైవర్... తిరిగి ఆ సొమ్మును పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.


First published: October 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...