హైదరాబాద్‌ ఎస్ఆర్ నగర్‌లో దారుణం... యువతిని ఈడ్చుకెళ్లిన కారు

అలేఖ్య అనే యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా... ఇంతలో ప్రణీత అనే మహిళ కారు నడుపుతూ వచ్చింది. రోడ్డు దాటుతున్న అలేఖ్యను ఢీకొట్టి కొంచెం దూరం ఈడ్చుకెళ్లింది.

news18-telugu
Updated: February 18, 2020, 9:49 AM IST
హైదరాబాద్‌ ఎస్ఆర్ నగర్‌లో దారుణం... యువతిని ఈడ్చుకెళ్లిన కారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదారబాద్‌ ఎస్ఆర్ నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి రోడ్డు దాటుతుండగా కారు ఆమెు ఢీకొట్టి కొంచెం దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలేఖ్య అనే యువతి రోడ్డు క్రాస్ చేస్తుండగా... ఇంతలో ప్రణీత అనే మహిళ కారు నడుపుతూ వచ్చింది. రోడ్డు దాటుతున్న అలేఖ్యను ఢీకొట్టి కొంచెం దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కారు కింద నలిగి ...అలేఖ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను కాపాడిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు