కారు డోర్ లాక్.. ముగ్గురు చిన్నారులు మృతి.. కృష్ణా జిల్లాలో విషాదం

అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు.

news18-telugu
Updated: August 6, 2020, 7:52 PM IST
కారు డోర్ లాక్.. ముగ్గురు చిన్నారులు మృతి.. కృష్ణా జిల్లాలో విషాదం
కారును పరిశీలిస్తున్న పోలీసులు
  • Share this:
ఆ చిన్నారులు ఆడుకోవడానికి ఎక్కిన కారు వారిని మృత్యువు ఒడిలోకి తీసుకెళ్లింది. సరదా కోసం కారులోకి వెళ్లిన ఆ చిన్నారులు.. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక విగత జీవులుగా మారిపోయారు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలారు.

మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ క్వార్టర్స్ ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో ఆ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని కేసు విచారణ చేపట్టారు.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading