కరీంనగర్‌ జిల్లాలో చెట్టును ఢీకొట్టి తగులబడిన కారు...

కారు మంటలు ఆర్పుతున్న ఫైరింజన్ సిబ్బంది

అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొనడంతో అందులో నుంచి మంటలు వచ్చాయి.

  • Share this:
    అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొనడంతో అందులో నుంచి మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే స్పందించి సమీప ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేయగా వారు వచ్చి మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామ శివారులో ఈ రోజు పెను ప్రమాదం తప్పింది. TS21AC 4502 నెంబర్ గల మారుతి వెగనర్ కారులో కోరుట్లకు చెందిన గంప శ్రీకాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి వరంగల్ నుంచి కోరుట్లకు వెళ్తున్నాడు. మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామం వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో నుంచి మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, మానకొండూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సమయానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేయసంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: