తల్లి చనిపోయిందని తెలిసి వస్తున్న కూతుళ్లు.. మరో రెండు కిలోమీటర్లలో ఊరికి చేరుకుంటామనగా..

ప్రమాదానికి గురయిన కారు, బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

’మీ అమ్మ చనిపోయింది. వీలయినంత త్వరగా రండి‘ అంటూ ఆ ఇద్దరు కూతుళ్లకు ఫోన్ వచ్చింది. అప్పటికే రాత్రి సమయం అయింది. అయినప్పటికీ ఆ కూతుళ్లు ఇద్దరూ తమ భర్తలు, కొడుకు, మేనమామతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఓ కారును మాట్లాడుకున్నారు.

 • Share this:
  ’మీ అమ్మ చనిపోయింది. వీలయినంత త్వరగా రండి‘ అంటూ ఆ ఇద్దరు కూతుళ్లకు ఫోన్ వచ్చింది. అప్పటికే రాత్రి సమయం అయింది. అయినప్పటికీ ఆ కూతుళ్లు ఇద్దరూ తమ భర్తలు, కొడుకు, మేనమామతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఓ కారును మాట్లాడుకున్నారు. అంతా కలిసి రాత్రిపూట ఆ కారులో ప్రయాణమయ్యారు. మరో రెండు కిలోమీటర్ల దూరంలో వారి గమ్యస్థానం ఉంది. కానీ ఇంతలోనే ఊహించని దారుణం జరిగింది. మితిమీరిన వేగం వల్ల ఆ కారు అదుపుతప్పింది. ఫలితంగా కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. తల్లిని చివరిచూపు చూడటానికని బయలుదేరిన వారంతా ఆస్పత్రి పాలయ్యారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ప్రసాదరావు భార్య చింత ధనలక్ష్మి మరణించింది. 60 ఏళ్ల చింత ధనలక్ష్మి గుండెపోటుతో మరణించిందని ఆమె కూతుళ్లు ఇద్దరికీ సమాచారం అందింది. ఆ కూతుళ్లు ఇద్దరూ గుంటూరు జిల్లాలోని బాపట్ల సూర్యలంక రోడ్డులో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి వారంతా రాత్రిపూట ఓ కారులో బయలుదేరారు. తమ భర్తలు, కొడుకు, మేనమామతో సహా కూతుళ్లిద్దరూ కారులో బయలుదేరారు.

  ఇది కూడా చదవండి: పెళ్లి కాని అమ్మాయిలే అతడి టార్గెట్.. అందమైన అబ్బాయిల ఫొటోలతో వల.. హైదరాబాద్ లో కొత్త మోసం వెలుగులోకి..!

  వారు ప్రయాణిస్తున్న కారు పెదనందిపాడు మీదుగా ప్రత్తిపాడు వెళ్తోంది. మరో రెండు కిలోమీటర్ల దూరంలో ప్రత్తిపాడుకు చేరుకుంటామనగా వారి కారు ప్రమాదానికి గురయింది. అతి వేగంతో వెళ్లడం వల్ల కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. కారులో ప్రయాణిస్తున్న చాపల వెంకయ్య (67), వెంకట ప్రవీణ్ కుమార్ (40), బాల కార్తికేయ (17), సురేంద్ర (37) శేషికాల (35), సౌందర్య (33) తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108 లో జీజీహెచ్ కు తరలించారు. కాగా మరణించిన డ్రైవర్ గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..
  Published by:Hasaan Kandula
  First published: