• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CANARA BANK THOKKILANGADI BRANCH MANAGER COMMIT SUICIDE IN BANK BY HANGING AFTER DEPRESSION WITH HUSBAND DEATH IN KERALA HSN

సీసీ కెమెరాలో రికార్డయిన షాకింగ్ సీన్.. పొద్దున్నే బ్యాంకుకు వెళ్లిన ఉద్యోగికి లోపల కనిపించిన దృశ్యం చూసి..

సీసీ కెమెరాలో రికార్డయిన షాకింగ్ సీన్.. పొద్దున్నే బ్యాంకుకు వెళ్లిన ఉద్యోగికి లోపల కనిపించిన దృశ్యం చూసి..

ప్రతీకాత్మక చిత్రం

రోజూలాగానే ఆ రోజు కూడా పొద్దున్నే బ్యాంకు ఉద్యోగుల్లో ఒకరు విధులకు వెళ్లారు. అప్పటికే బ్యాంకు తలుపులు తీసే ఉన్నాయి. మేనేజర్ ముందే వచ్చి ఉంటారని ఊహించాడు. అతడి ఊహ నిజమే. కానీ బ్యాంకు లోపలకు అడుగు పెట్టిన వెంటనే అతడికి..

  • Share this:
    సిటీలో రద్దీగా ఉండే బ్యాంకు అది. బ్యాంకు తెరిచినప్పటి నుంచి మూసేసే వరకు నిత్యం ఖాతాదారులతో బిజీబిజీగా కనిపిస్తుంటుంది. రోజూలాగానే శుక్రవారం ఉదయం కూడా ఆ బ్యాంకు ఉద్యోగుల్లో ఒకరు విధులకు వెళ్లారు. అప్పటికే బ్యాంకు తలుపులు తీసే ఉన్నాయి. రోజూ లాగానే మేనేజర్ ముందే వచ్చి ఉంటారని ఊహించాడు. అతడి ఊహ నిజమే. కానీ బ్యాంకు లోపలకు అడుగు పెట్టిన వెంటనే అతడికి ఓ షాకింగ్ సీన్ కనిపించింది. బ్యాంకులో ఉన్న ఓ ఇనుప కొక్కేనికి బ్యాంకు మేనేజర్ ఉరి వేసుకుని కనిపించింది. ఆ షాకింగ్ దృశ్యాన్ని చూసి అతడు నిర్ఘాంతపోయాడు. వెంటనే తేరుకుని ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె మరణించింది. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కేరళ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో తొక్కిలంగడిలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్ కు కేఎస్ స్వప్న అనే ఆమె మేనేజర్ గా పనిచేస్తున్నారు. పనిలో ఎప్పుడూ నిక్కచ్చిగా ఉండే ఆమె అంటే బ్యాంకు సిబ్బందికి అందరికీ గౌరవంతోపాటు అభిమానమే. అయితే ఏడాది క్రితం ఆమె భర్త మరణించాడు. అప్పటి నుంచే ఆమె కాస్త అన్యమనస్కంగా ఉండేది. భర్త మరణం వల్ల ఆమె పూర్తిగా ఒత్తిడికి, మనోవేధనకు గురయింది. చాలా రోజుల పాటు లీవ్ లో కూడా ఉంది. అయితే బంధువులు, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ ఉద్యోగంలో చేరింది. పనిపై ధ్యాసను పెట్టింది. అయినప్పటికీ భర్త లేని జీవితాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నా, వారితో గడుపుతున్న ప్రతీ క్షణం భర్తను గుర్తుకుతెచ్చుకునేది. భర్త మరణంతో కుంగిపోయిన స్వప్న రోజూలాగానే శుక్రవారం విధిగా బ్యాంకుకు వచ్చింది. బ్యాంకు తాళాలను తీసి లోపలకు వెళ్లింది.
    ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

    తన చున్నీతో బ్యాంకులోని ఫ్యాన్ ఇనుప కొక్కేనికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం 8గంటల 45 నిమిషాల ప్రాంతంలో మరో బ్యాంకు ఉద్యోగి ఒకరు వచ్చారు. బైక్ ను పార్క్ చేసి లోపలకు వెళ్లాడు. అంతే, లోపల కనిపించిన సీన్ చూసి కంగుతిన్నాడు. మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడంతో దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే బయట ఉన్న వారి సాయంతో ఆమెను కిందకు దింపి ఆసుపత్రికి తరలించాడు. అయినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయాడు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఏడాది క్రితం భర్త, ఇప్పుడు భార్య మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ ఘటనను తాము అస్సలు ఊహించలేకపోయామని బ్యాంకు ఉద్యోగులు వాపోయారు. బ్యాంకు సీసీ కెమెరాల్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నది స్పష్టంగా కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు