పెళ్లి చేసుకుంటానని సెక్స్ చేసి వదిలేస్తే‘రేప్’కిందే లెక్క: సుప్రీంకోర్టు

చత్తీస్ గఢ్ లో ఓ యువతికి, అనురాగ్ సోనీ అనే యువకుడికి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో 2009లో వీరిద్దరూ సహజీవనం చేశారు.

news18-telugu
Updated: April 15, 2019, 9:19 AM IST
పెళ్లి చేసుకుంటానని సెక్స్ చేసి వదిలేస్తే‘రేప్’కిందే లెక్క: సుప్రీంకోర్టు
నమూనా చిత్రం
  • Share this:
ఏ మహిళనైనా సరే.. పెల్లి చేసుకుంటానని నమ్మించి ఆమె అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నా... ఆ తర్వాత మాత్రం పెళ్లికి నిరాకరిస్తే అది రేప్ కిందకే వస్తుందని సుప్రీంకొర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి, యువతి అంగీకారంతోనే అయినా శారీరకంగా కలసి, ఆపై పెళ్లికి నిరాకరిస్తే, అది అత్యాచారమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చత్తీస్ గఢ్ లో ఓ యువతికి, అనురాగ్ సోనీ అనే యువకుడికి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని చెప్పడంతో 2009లో వీరిద్దరూ సహజీవనం చేశారు. ఆ తర్వాత అనురాగ్ ముఖం చాటేయడంతో కోర్టును ఆశ్రయించింది బాధితురాలు. ట్రయల్ కోర్టులో పదేళ్ల జైలు శిక్ష పడగా, నిందితుడు దాన్ని హైకోర్టులో సవాల్ చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

దీంతో జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం కేసును విచారించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు కాబట్టి, శారీరక కలయికకు ఆమె సమ్మతిని సాధారణ అనుమతిగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. లైంగికంగా కలిసేందుకు ఆమె అంగీకరించినా అది అత్యాచారమేనని, హత్య కన్నా రేప్ అత్యంత దారుణమైనదని చివాట్లు పెట్టింది, నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. హత్య శరీరానికి సంబంధించినది అయితే.. రేప్ శరీరంతో పాు మనసుకు సంబంధించినదని కోర్టు పేర్కొంది. ఆ బాధ జీవితాంతం వెంటాడుతందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది
First published: April 15, 2019, 9:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading