ఆమె హంతకురాలు కాదు... వివాహేతర సంబంధాల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Illicit Relationship : మన దేశంలో అప్పుడప్పుడూ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం అందరం ఏది ఊహిస్తామో... అందుకు విరుద్ధమైన తీర్పు ఇస్తూ ఉంటుంది అత్యున్నత న్యాయస్థానం. ఓ వివాహేతర సంబంధం కేసులోనూ అలాంటి తీర్పే ఇచ్చి... అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: January 29, 2019, 6:30 AM IST
ఆమె హంతకురాలు కాదు... వివాహేతర సంబంధాల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు(File)
  • Share this:
వివాహేతర సంబంధం నేరం కాదని ఇదివరకు తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు... దానికి అదనంగా మరో తీర్పును జత చేసింది. అందుకు ఓ కేసులో జరిగిన పరిణామాలు దారితీశాయి. ఏం జరిగిందంటే... తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన మాధురీ (పేరు మార్చాం) ఎదురింటాయనతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా కుటుంబాల్లో జరిగినట్లే... ఆ ఫ్యామిలీలోనూ కలతలు వచ్చాయి. మాధురి భర్త ఆమెను ఒకట్రెండు సార్లు నిలదీశాడు. మరోసారి చంపేస్తానని బెదిరించాడు. చివరకు ఓ రోజు... వాళ్లిద్దరి మధ్యా గొడవ హద్దులు దాటింది. ఆ పరిస్థితుల్లో ఆవేశంతో రగిలిపోతూ... మాధురినీ, ఆమె 17 ఏళ్ల కూతురినీ ఇద్దర్నీ... సెక్స్ వర్కర్లు అన్న మీనింగ్ వచ్చేలా తిట్టాడు. అంతే... ఆమె తట్టుకోలేకపోయింది. పిచ్చి కోపంతో ఊగిపోతూ... భర్త మెడను పట్టుకుంది. పక్కనే ఉన్న టవల్‌ను మెడచుట్టూ బిగించింది. ఇదంతా ఆమె ఒక్కత్తే చెయ్యలేదు. ఎదురింట్లో ఉన్న ప్రియుడు ఎంట్రీ ఇచ్చి... హత్యకు సహకరించాడు. అలా భర్త చనిపోయాడు. ఇద్దరూ కలిసి శవాన్ని కాల్చిబూడిద చేశారు. ఓ నెల తర్వాత ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. స్థానిక కోర్టు, మద్రాస్ హైకోర్టూ... మాధురీ, ఆమె ప్రియుడూ కలిసి హత్య చేశారని నిర్ధారిస్తూ... శిక్ష విధించాయి.

ఈ కేసులో దోషిగా తేలిన మాధురీ... సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఈ కేసు మలుపు తిరిగింది. సెక్స్ వర్కర్ (వేశ్య) అని పిలవడం వల్లే... ఆవేశంతో హత్య చేశాననీ, కావాలని చెయ్యలేదనీ మాధురీ సుప్రీంకోర్టులో తెలిపింది. ఆమె వాదనను సమర్థించిన సుప్రీంకోర్టు... మన భారతీయ సమాజంలో... ఏ మహిళనైనా సెక్స్ వర్కర్ అంటే సహించరనీ, తననూ, తన కూతుర్నీ అలా పిలవడం వల్లే ఆమె హత్య చేసిందని సుప్రీంకోర్టు భావించింది. ఇది పరిస్థితుల వల్ల జరిగిన హత్యే తప్ప... ప్లాన్ ప్రకారం చేసింది కాదని తేల్చింది. అందువల్ల దీన్ని హత్యగా భావించలేమన్న సుప్రీంకోర్టు... శిక్షించే తరహా హత్యగా భావించాలని తెలిపింది. అందువల్ల మాధురీ, ఆమె ప్రియుడికి హత్య కేసులో పడే శిక్ష (జీవిత ఖైదు) కాకుండా... అనుకోకుండా చేసిన హత్య కేసుగా భావిస్తూ ఇద్దరికీ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

 

అందాల భామలతో అదరగొడుతున్న కింగ్ ఫిషర్ క్యాలెండర్-2019
First published: January 29, 2019, 6:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading