• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • CALL GIRL CRIME NEWS CALL GIRL CAME FROM THAILAND TO LUCKNOW BUT DIED OF CORONAVIRUS HERE IS THE FULL DETAILS NK

Call girl: థాయిలాండ్ నుంచి లక్నో వచ్చిన కాల్ గర్ల్... ఆ తర్వాత ఏమైందంటే...

Call girl: థాయిలాండ్ నుంచి లక్నో వచ్చిన కాల్ గర్ల్... ఆ తర్వాత ఏమైందంటే...

Call girl: థాయిలాండ్ నుంచి లక్నో వచ్చిన కాల్ గర్ల్... ఆ తర్వాత ఏమైందంటే... (ప్రతీకాత్మక చిత్రం)

Call girl: థాయిలాండ్‌ అనేది ప్రపంచ టూరిజం అడ్డా. అలాంటి చోటి నుంచి ఆ కాల్ గర్ల్ ఇండియాకి ఎందుకొచ్చింది... ఆమెను ఎవరు పిలిపించారు. వచ్చాక ఏమైంది? తెలుసుకుందాం.

  • Share this:
    Call girl: ఇండియా నుంచి ఓ వ్యాపార వేత్త కొడుకు థాయిలాండ్ వెళ్లాడు. అక్కడి బీచుల్లో బాగా ఎంజాయ్ చేశాడు. అతనికో అమ్మాయి నచ్చింది. ఆమె కాల్ గర్ల్. రేటెంత అన్నాడు. చెప్పింది. నాతో వస్తావా అన్నాడు. రానంది. రావాలంటే రేటెంత అని అడిగితే... పది లక్షలు కావాలంది. రూ.7 లక్షలకు డీల్ కుదిరింది. ఇండియాకి వచ్చింది. ఇండియా బాగుందా... థాయిలాండ్ బాగుందా అని అడిగితే... దేనికదే స్పెషల్ అంది. "ఇండియాలో స్వేచ్ఛ ఎక్కువ. ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు"... అంటే... "అందుకేనా నన్ను ఇక్కడికి తెప్పించుకున్నారు"... అంటూ నవ్వేసింది. "ఏం చెయ్యను. నేను ఇండియాకి రాక తప్పదు. నువ్వు చూస్తే మర్చిపోయే ఫేసా నీది. కొంతకాలం నువ్వు నాతో ఉంటే బాగుంటుంది అనిపించింది" అన్నాడు. మళ్లీ నవ్వేసిన ఆ అమ్మాయి... "నేను కాల్ గర్ల్‌ని... నాతో పర్మనెంట్ డీల్స్ పనికిరావు... నో సెంటిమెంట్స్... ఓన్లీ బిజినెస్" అనేసింది.

    రెండ్రోజుల తర్వాత... ఆ యువకుడు ఆఫీస్‌లో బిజీగా ఉండగా... మరో చోటి నుంచి ఆ అమ్మాయి కాల్ చేసింది. "నాకు కరోనా పాజిటివ్ వచ్చింది" అని చెప్పింది. షాకయ్యాడు. జోక్ చెయ్యకు అన్నాడు. "జోక్ కాదు... జ్వరంగా ఉంటే... టెస్ట్ చేయించా..." అంది. ఓకే... డోంట్ వర్రీ... నేనున్నాను. నేను వస్తాను. టేక్ కేర్" అన్నాడు. ఇలా రెండ్రోజులు తీవ్ర జ్వరంతో బాధపడిన ఆమె... మూడో రోజు లోహియా ఆస్పత్రిలో చనిపోయింది. ఆమెను ఆ వ్యాపారి కొడుకే థాయిలాండ్ నుంచి తీసుకొచ్చాడని తెలిసింది. ఆమెకు ఇండియా వచ్చాక కరోనా సోకిందని అధికారులు తేల్చారు.

    కేసు రాసిన పోలీసులు... థాయిలాండ్ రాయబార కార్యాలయానికి కాల్ చేశారు. మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అందజేయాల్సిందిగా కోరారు. ఐతే... ఆమె కోసం థాయిలాండ్ నుంచి ఎవరూ రాలేదు. రాజస్థాన్ నుంచి ఓ ఏజెంట్ మాత్రం వచ్చాడు. అతనే ఆమె థాయిలాండ్ నుంచి ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. అతని సమక్షంలోనే ఇండియాలో అంత్యక్రియలు జరిపారు. ఏజెంట్ పేరు సల్మాన్ అని తెలిసింది.

    ఆమె కాల్ గర్ల్ అని తెలిశాక... ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్‌గా కేసు రాసిన పోలీసులు... ఆమె ఇండియాలోకి వచ్చేందుకు ఎవరు సహకరించారని దర్యాప్తు చేశారు. రాజస్థాన్‌లోని ట్రావెల్ ఏజెంట్ సల్మాన్... ఆమె ఇండియాలోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు తెలుసుకున్నారు. ఐతే... ఆమె కాల్ గర్ల్ అని తనకు తెలియదని ఏజెంట్ అంటున్నాడు. వ్యాపార వేత్త కొడుకును పోలీసులు ప్రశ్నించాల్సి ఉన్నా... అతనిపై ఏ కేసూ రాయలేదని తెలుస్తోంది. ఇలా ఈ కేసును నీరుగార్చేస్తున్నారని తెలుస్తోంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశుల్లో గాలి, నీరు, నిప్పు, భూ రాశులు... మీది ఏ రాశి... ఏంటి ప్రత్యేకత?


    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు బాగా వస్తున్నాయి. నిన్న 26వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. అందువల్ల పోలీసులకు ఇలాంటి కేసుల్ని పట్టించుకునే టైమ్ లేదు. ఇప్పుడు ఈ విషయం కంటే... కరోనాను తగ్గించడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పోలీసులు. ఇలా ఓ కాల్ గర్ల్... ఇండియాలో అడుగుపెట్టి... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె చావు దిక్కులేని చావు అయ్యింది.
    Published by:Krishna Kumar N
    First published: