California shooting Tragedy: కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కాల్పుల శబ్దాలతో ఉలిక్కిపడింది. దుండగుడు జరిపిన కాల్పులలో 6 గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శాక్రమెంటో నగరం ఆదివారం కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. దీంతో ఒక్కసారిగి స్థానికులు పరుగులు పెట్టారు. ఏం జరిగిందో తెలిసే లోగా.. బుల్లెట్ ల ధాటికి పలువులు కింద పడి మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 15 మంది కాల్పులలో గాయపడినట్లు గుర్తించారు. వీరిలో ఆరుగురు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. స్థానికులు గాయపడిన వారిని అంబులెన్స్ లో సమీపంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతి చెందిన వారిని కూడా పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. దుండగుడి కోసం వేటను ప్రారంభించారు. అమెరికా ఈ కాల్పుల ఉదంతంతో మరొసారి ఉలిక్కి పడింది.
గతంలో ఇలాంటి కాల్పులు లాస్ వేగాస్ లో జరిగాయి.
Las Vegas Lounge Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:15 గంటలకు లాస్ వెగాస్ ఈస్ట్ సహారా అవెన్యూలోని 900 బ్లాక్ లో హుక్కా లాంజ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. హుక్కా లాంజ్‌లో జరిగిన పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగిందని,గొడవ పెద్దదవడంతో ఇద్దరు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ కాల్పుల్లో కనీసం ఒకరు మరణించగా, 13 మంది గాయపడినట్లు లాస్ వేగాస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని,వారు ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే బాధితులు మరియు నిందితుల పేర్లను అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.