Leopard burnt alive : ఓ మహిళ ప్రాణాలు తీసిందన్న కోపంతో..బోనులో చిక్కుకున్న చిరుత(Leopard)ను గ్రామస్తులు సజీవదహనం చేశారు. అటవీశాఖ అధికారుల వారిస్తున్నా వినకుండా వారి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో మంగవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి సంబంధిత గ్రామ ప్రధాన్‌తో సహా 150 మందిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు గర్వాల్ సర్కిల్, అటవీ సంరక్షణాధికారి నిత్యానంద్ పాండే తెలిపారు.
మే 15న ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లా సప్లోరి గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుష్మాదేవిని చిరుతపులి దాడి చేసి చంపిందని పాండే తెలిపారు. దీంతో ప్రమత్తమైన అధికారులు చిరుతను పట్టుకునేందుకు అదే రోజు గ్రామంలో బోను ఏర్పాటు చేశారు. మే 24న చిరుత ఆ బోనులో చిక్కిందని పాండే తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిరుతను నాగదేవ్ రేంజ్ ఆఫీసుకు తరలిస్తుండగా.. సప్లోడీ సహా సార్నా, కుల్మోరీకు చెందిన 150 మంది వారిని అడ్డుకున్నారు. చిరుత దాడిలో తన మహిశ మృతిచెందడం పట్ల ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు...అటవీ శాఖ సిబ్బంది వద్దని వారిస్తున్నప్పటికీ చిరుత ఉన్న బోనుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఈ క్రమంలో ఆ చిరుత కాలిపోయి ప్రాణాలు విడిచిందని పాండే తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత గ్రామ ప్రధాన్ అనిల్ కుమార్ సహా 150 మందిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాండే తెలిపారు.
ALSO READ Viral Video : భర్తను క్రికెట్ బ్యాట్ తో చితక్కొట్టిన భార్య..గృహ హింస కేసు పెట్టిన భర్త
మరోవైపు, ఆఫ్రికాలోని (Africa) సౌత్ సుడాన్ లో ఒక వింత ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మాన్యాంగ్ ధాల్ లో ఈ సంఘటన జరిగింది. అకుల్ యోల్ ప్రాంతంలో.. ఆదియు చాంపింగ్ (45) అనే మహిళపై, ఒక గొర్రె దాడిచేసింది. మహిళను కిందపడేసి పదే పదే కొమ్ములతో కుమ్మేసింది. (Chaping repeatedly) దీంతో మహిళ అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెను చూసిన డాక్టర్లు ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని, అప్పటికే చనిపోయిందని తెలిపారు. దీంతో బాధిత తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు గొర్రె .. రామ్ అనే వ్యక్తిది. మరణించిన మహిళ.. వీరికి సమీప బంధువుకూడా. అయితే... పోలీసులు పొట్టెలును, దాని యజమాని రామ్ ను అదుపులోనికి తీసుకున్నారు. వీరిని కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే, ఘటనను విచారించిన కోర్టు, వెరైటీ తీర్పును వెలువరించింది. ఘటనకు కారణమైన గొర్రెకు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. (Sheep Sentenced To Three Years In Jail) అదే విధంగా, గొర్రె యజమానిని నిర్దోషి అని తేల్చింది.
అయితే, మరణించిన మహిళ కుటుంబానికి , ఐదు ఆవులను పరిహరంగా ఇవ్వాలని గొర్రె యజమానికి కోర్టు ఆదేశించింది. ఇక శిక్ష కాలంలో, గొర్రె సౌత్ సుడాలన్ లోని లేక్ స్టేట్ లోని ఆడ్యూల్ కౌంటి సైనిక శిబిరంలో గొర్రె మూడేళ్ల పాటు ఉంటుందని తీర్పు వెలువరించింది. అంతే కాకుండా, సౌత్ సుడాన్ చట్టాల ప్రకారం.. మూడేళ్లు శిక్ష పూర్తయ్యాక.. గొర్రె బాధిత కుటుంబానికి చెందుతుందని కోర్టు తెలిపింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Leopard, Uttarakhand