హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: వీడికేం మాయరోగం.. తెలిసిన వాడే కదా అని క్యాబ్ ఎక్కితే ఇంత పనిచేశాడు..

Shocking: వీడికేం మాయరోగం.. తెలిసిన వాడే కదా అని క్యాబ్ ఎక్కితే ఇంత పనిచేశాడు..

అత్యాచారాలపై నిరసన

అత్యాచారాలపై నిరసన

Delhi: తెలిసిన వాడే కదా అని తరచుగా అదే క్యాబ్ ను బుక్ చేసుకునేది . ఈ క్రమంలో పనిమీద బయటకు వెళ్లింది.

దేశంలో మహిళలు, అమ్మాయిల భద్రత పట్ల తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ప్రతి రోజు మహిళలపై  (Rape on girl) అఘాయిత్యాలు, దాడుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ప్రభుత్వాలు, దిశ, నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చిన, వాటి అమలు మాత్రం సరిగ్గా లేదు. మహిళలు, ఇంట్లోను, బడి, గుడి, ఆఫీస్, బస్టాండ్, ఇలా ప్రతి చోట్ల వేధింపులకు గురౌతున్నారు. కామాంధులు, పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. అందరిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల తెలిసిన వారే మహిళలను నమ్మించి అత్యాచారాలకు పాల్పడుతన్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఒక మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మే 11 న జరిగింది. కాగా, సఫ్దర్ జంగ్ ప్రాంతంలో 62 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంది. ఆమెను బంధువులు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటారు. ఈ క్రమంలో.. ఆమెకు ఇంటి దగ్గర క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఆమె ఎక్కడికి వెళ్లాలన్న అదే క్యాబ్ లో వెళ్లేది.

బాధితురాలు.. మే 11 న కన్నాట్ ప్రాంతానికి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు చీకటిపడింది. అప్పుడు క్యాబ్ డ్రైవర్ కారును (cab driver)  నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెను బలవంతంగా కారులో నుంచి బయటకు లాగి కిందపడేశాడు. ఆ తర్వాత.. అత్యాచారానికి (Rape on woman) పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతొో తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత..  ఆమెను రోడ్డుమీద తీసుకొచ్చి వదిలేసి పారిపోయాడు. ఈ క్రమంలో బాధితురాలు, తీవ్ర గాయాలపాలైన దశలో స్థానికులు ఆమెను గుర్తించారు. వెంటనే పోలసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాజస్థాన్ లో (Rajasthan)  అమానుషం చోటు చేసుకుంది.

12 బాలిక తన తల్లితో పాటు తాత దగ్గర ఉంటుంది. ఆమె తండ్రి 12 ఏళ్ల క్రితమే మరణించాడు. బాలికి తల్లి మానసిక వికలాంగురాలు. ఆమెతో ఎవరితో సరిగ్గా మాట్లాడదు. బాలిక తాత.. తాగుడుకు బానిసయ్యాడు. ఇతను వీరిని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో.. తాత.. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోనే బాలికపై అత్యాచారానికి (Rapes girl)  పాల్పడేవారు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇటీవల పాఠశాలలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఆమెను చూసిన వైద్యులు 5 నెలల గర్భవతి (pregnant)అని తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో బాలిక షాకింగ్ విషయాలు (shocking) వెల్లడించింది. తన తాత.. మరో ఇద్దరు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది. తాత.. స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), వీరు గత నెలలుగా బెదిరిస్తు.. అఘాయిత్యానికి పాల్పడుతున్నారని బాలిక వాపోయింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.

First published:

Tags: Delhi, Female harassment, Rape case, Rape on women

ఉత్తమ కథలు