ప్రయాణికుడిని చితక్కొట్టి.. నగలు, నగదుతో క్యాబ్ డ్రైవర్ పరార్..

శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు వద్ద ఓ ప్రయాణికుడిని ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్.. అతడ్ని చితకబాది యూకే కరెన్సీ, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 4, 2019, 1:07 PM IST
ప్రయాణికుడిని చితక్కొట్టి.. నగలు, నగదుతో క్యాబ్ డ్రైవర్ పరార్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు వద్ద ఓ ప్రయాణికుడిని ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్.. అతడ్ని చితకబాది యూకే కరెన్సీ, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. దమ్మాయిగూడకు చెందిన ప్రయాణికుడు యూకేలో నివాసం ఉంటున్నాడు. 15 రోజుల్లో తన పెళ్లి ఉండగా హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి క్యాబ్ ఎక్కాడు. అయితే, ఆ క్యాబ్ డ్రైవర్ కొంత దూరం వెళ్లాక దారి మళ్ళించి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అతడ్ని దారుణంగా చితకబాదాడు. అతడి వద్ద రెండు లక్షల యూకే కరెన్సీ, బంగారాన్ని క్యాబ్ డ్రైవర్ ఎత్తుకెళ్లాడు.

వెంటనే బాధితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నానని, తానున్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు వెల్లడించాడు. హుటాహుటిన బాధితుడి కుటుంబీకులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

First published: September 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>