CA STUDENT COMMIT SUICIDE AFTER LOSS IN ONLINE RUMMY IN MANCHIRYAL DISTRICT NS
Online Rummy: సీఏ స్టూడెంట్ ను ఆగం చేసిన ఆన్లైన్ రమ్మి.. లక్షల కొద్దీ అప్పులు కావడంతో..
ప్రతీకాత్మక చిత్రం
ఆన్లైన్ రమ్మీ అనేక మంది జీవితాలను ఆగం చేస్తోంది. తాజాగా సీఏ చదివిన 25 ఏళ్ల విద్యార్థి ఆన్లైన్ రమ్మీ కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో ఉన్నతంగా రాణించిన ఆ విద్యార్థి జీవితం ఈ ఆన్లైన్ రమ్మీ కారణంగా అర్థంతరంగా ముగిసిపోయింది.
ఆన్లైన్ రమ్మీ అనేక మంది జీవితాలను ఆగం చేస్తోంది. తాజాగా సీఏ చదివిన 25 ఏళ్ల విద్యార్థి ఆన్లైన్ రమ్మీ కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో ఉన్నతంగా రాణించిన ఆ విద్యార్థి జీవితం ఈ ఆన్లైన్ రమ్మీ కారణంగా అర్థంతరంగా ముగిసిపోయింది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్‌కు చెందిన సీపతి అభిలాష్ (25) సీఏ చదువుతున్నాడు. అయితే అతడు ఆన్లైన్లో రమ్మి ఆటకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో అతడు ఆ ఆటకు బానిసగా మారాడు. దీంతో లక్షల రూపాయలు అప్పు చేశాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇరవై రోజుల క్రితం ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. అనంతరం ఆదివారం తిరిగి వచ్చి మంచిర్యాలలోని సాయికుంట.. గోదావరి తీరంలో విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
అభిలాష్ మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతడి చేతిపై సోదరుడు ఆకాశ్ సెల్ నంబరు రాసి ఉంది. గమనించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే.. అభిలాష్ తండ్రి రవి గతంలోనే మరణించగా.. తల్లి లలిత, సోదరుడు ఆకాశ్ మొబైల్ క్యాంటిన్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అభిలాష్ మరణించడంతో ఆ కుటుంబం పెను విషాదం నిండుకుంది.
ఇదిలా ఉంటే.. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, JDS ఎమ్మెల్సీ ధర్మె గౌడ ఆత్మహత్య చేసుకున్నారు. చిక్ మంగళూరు జిల్లా... కదుర్ లోని గుణసాగర్దగ్గర్లోని రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్య ఘటన కర్ణాటక వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం... సోమవారం సాయంత్రం ధర్మె గౌడ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నదీ ఎవరికీ చెప్పలేదు. క్యాజువల్‌గా వెళ్తున్నట్లుగా వెళ్లారు.
దాంతో ఆయనపై ఎవరికీ అనుమానం కలగలేదు. అలా వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. దాంతో ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎమ్మెల్సీ గన్‌మెన్, పోలీసులు ఆయన కోసం గాలించారు. ఎక్కడా కనిపించలేదు. ఆయన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే ఆత్మహత్య ఘటన అందర్నీ విషాదంలో ముంచేసింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.