• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • BUSINESSMAN REGISTERED LAND ILLEGALLY IN NIRMAL DISTRICT VB

Illegal registration: భార్యపేరుపై ఊరు రిజిస్ట్రేషన్ .. మూడేళ్ల నుంచి రైతుబంధు సాయం కూడా.. ఆలస్యంగా వెలుగులోకి..

ప్రతీకాత్మక చిత్రం (Image credit - You tube)

Illegal registration: వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించడం చూశాం. కానీ ఓ వ్యాపారి ఒక గ్రామాన్నే తన భార్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అంతే కాకుండా ఆ భూమిపై రైతుబంధు కూడా తీసుకుంటున్నాడు. విషయం తెలిసిన గ్రామస్తులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.

  • Share this:
    పోడు వ్యవసాయం చేసుకుంటూ.. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఆదీవాసీల గ్రామాన్ని ఓ వ్యాపారి తన భార్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలోని వేణునగర్‌ ఆదివాసీలు గతంలో అటవీ ప్రాంతంలోని కొత్తచెరువుగూడలో నివసించేవారు. గ్రామం నుంచి పెంబి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్న 4.32 ఎకరాల (అసైన్డ్) వ్యవసాయ భూమిని రూ. 60 వేలకు కొనుగోలు చేశారు. అనతంరం అక్కడే వారు గుడిసెలు వేసుకుని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అధికారలను తమపై ఇళ్లపట్టా చేయమని ఎన్నిసార్లు వేడుకున్నా వారు ఇది ప్రభుత్వ భూమి చేయడం కుదరదని చెప్పేవారు. అయితే ఈ భూమిని పెంబికి చెందిన ఓ వ్యాపారి 2002లో తన భార్యపేరిట నిర్మల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ప్రభుత్వ భూమి అయి ఉండి ఈ వ్యాపారి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. ‘ధరణి’ వెబ్ సైట్ లో ఈ భూమి వ్యాపారి భార్య పేరుపై అసైన్డ్ భూమిగా నమోదై ఉంది. అంతేకాదు, గత మూడేళ్లుగా రైతు బంధు సాయం కూడా అందుకుంటుంన్నాడు.

    అయితే ఈ భూమిని అమ్మినవారికి కానీ, కొన్నవారికి కానీ ఈ విషయం తెలియదు. అయితే ఈ మధ్య జిల్లాలో రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది. భూమి ధరలు మాత్రం కోట్లలో పలుకుతున్నాయి. గమనించిన సదరు వ్యాపారి తను రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమి కోట్లలో పలుకుతుందని తెలుసుకున్నాడు. తాజాగా వ్యాపారి ఆదివాసీల వద్దకు వచ్చి ఈ భూమి తనదేనని చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నామ.. మీ భూమి ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు.

    2002 లోనే తనే తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించానని చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ సర్పంచ్ రాధతో కలిసి తహసీల్దార్‌కు గ్రామస్థులు విన్నవించారు. తమకు పట్టాలు ఇవ్వమంటే ఇవ్వని అధికారులు వ్యాపారికి మాత్రం అక్రమంగా పట్టా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజమోహన్ తెలిపారు.
    Published by:Veera Babu
    First published: