హోమ్ /వార్తలు /క్రైమ్ /

Jammu: వైష్ణో దేవి యాత్రలో పెను విషాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. నలుగురు సజీవదహనం..

Jammu: వైష్ణో దేవి యాత్రలో పెను విషాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. నలుగురు సజీవదహనం..

మంటల్లో చిక్కుకున్న బస్సు

మంటల్లో చిక్కుకున్న బస్సు

Jammu kashmir: వైష్ణో దేవి యాత్రికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిముషాల్లోనే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.

జమ్ములోని వైష్ణోదేవి (Vaishno Devi ) అమ్మవారిని దర్శించుకొవడానికి భక్తులు కత్రా నుంచి బస్సులో (Bus accident) జమ్ముకు బయలు దేరారు. ఈ క్రమంలో కత్రాకు 1.5 కిలో మీటర్ల దూరంలో బస్సు ఖర్మల్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంటలు ఇంజిన్ లో మంటలు (Fire accident) వ్యాపించాయి. అవి వేగంగా బస్సును చుట్టు ముట్టాయి. బస్సులో ఉన్న నలుగురు కాలిబూడిదయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్ లోను అక్కడికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా.. బస్సు.నెం.JK14/1831 కత్రా నుండి 1 కి.మీ దూరంలో మంటలు చెలరేగాయని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం (Mumbai Fire Accident) జరిగింది. కర్రీ రోడ్డు ప్రాంతంలో ఉన్న 60 అంతస్తుల అవిఘ్నా పార్క్ టవర్‌ (Avighna Park Tower)లో మంటలు చెలరేగాయి. 19వ అంతస్తు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను చూసి ఆ భవనంలో నివసిస్తున్న వారు భయంతో వణికిపోయారు. కొందు ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. ఐతే ఓ వ్యక్తి 19వ అంతస్తు బాల్కని నుంచి కింద పడి మరణించారు. మృతుడిని 30 ఏళ్ల అరుణ్ తివారిగా గుర్తించారు పోలీసులు. అతడు కింద పడిన వెంటనే హుటాహుటిన KEM ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఉదయం 11.50 నిమిషాల సమయంలో భవనం నుంచి మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. 26 మందికి మంటల నుంచి కాపాడారు. ఇక ముందు జాగ్రత్తగా 19 అంతస్తులో ఉండే మిగతా వారిని కిందకు తరలించారు. ఈ ప్రమాదాన్ని లెవెల్-4  గుర్తించారు అధికారులు.  అంటే చాలా తీవ్రమైన అగ్నిప్రమాదమని చెప్పారు. అగ్నిప్రమాదానికి గురైన అవిఘ్నా పార్క్ టవర్‌లో మొత్తం 61 అంతస్తులు ఉన్నాయి. ఐతే ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

First published:

Tags: Bus acident, Fire Accident, Jammu and Kashmir