Home /News /crime /

BUS CARRYING 39 SECURITY PERSONNEL ROLLS DOWN TO RIVER BED IN PAHALGAM PVN

OMG : ఘోర ప్రమాదం.. బ్రేకులు ఫెయిల్ అయ్యి నదిలో పడిపోయిన జవాన్ల బస్సు

Image Credit : ANI

Image Credit : ANI

Bus Rolls Down To River Bed : జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో పహల్గామ్‌లో నదిలో పడిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Jawans Bus Falls Into Riverbed : జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) లో ఘోర ప్రమాదం జరిగింది.  మంగళవారం ుదయం 37 మంది ఐటీబీపీ(Indo Tibetan border police) సిబ్బంది, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అనంతనాగ్ జిల్లాలో చందన్ వారి పహల్గామ్‌ దగ్గర్లోని ఫ్రిస్లాన్ గ్రామం దగ్గర నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6గురు మరణించినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రమాదంలో 25 మంది ఐటీబీపీ సిబ్బందితో పాటు ఇద్దరు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ లో శ్రీనగర్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.

అమర్ నాథ్ యాత్ర కోసం ఆ ప్రాంతంలో డ్యూటీలో నియమించబడ్డ ఈ ఐటీబీపీ సిబ్బంది చందన్ వారీ నుంచి పహల్గామ్ కు వస్తోన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.



జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్.. ఈ సంఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్‌లో ..."చందన్‌వారి సమీపంలో బస్సు ప్రమాదంలో మేము మా ధైర్యమైన ITBP సిబ్బందిని కోల్పోయాము. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. గాయపడిన సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తున్నారు"అని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bus accident, Itbp, Jammu and Kashmir

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు