• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BUS ACCIDENT NEAR VISAKHAPATNAM FIVE PASSENGERS DEAD 30 MEMBERS INJURED NGS

Andhra Pradesh: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొని ఐదుగురు మృతి

Andhra Pradesh: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొని ఐదుగురు మృతి

విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం

విజయనగరంలో ఉదయాన్నే పెను విషాదం నెలకొంది. రెండు బస్సులు, ఒక లారీ ఢీ కొనడంతో ఐదగురు మృతి చెందారు.. 30 మంది గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.

  • Share this:
    విజయనగరం (vizianagaram) జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలండర్ల లారీ, ఆర్టీసీ బస్సును (lorry, rtc bus) ఢీ కొంది. అయితే అదే సమయంలో విశాఖపట్నం (visakhapatnam)నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు  ముందున్న బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో సుమారు 30 మందికి పైగా గాయలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే డంపింగ్ యార్డ్ ఉండడంతో ఉదయాన్నే అక్కడ ఉన్న చెత్తను తగులబెట్టగారు..

    ఉదయాన్ని రోడ్లు నిర్మాణుష్యంగా ఉండడంతో ఆ వాహనాలు అతి వేగంగా వెళ్తున్నాయి. అదే సమయంలో రహదారి మొత్తం.. చెత్త తగులబెట్టగిన పోగ కమ్ముకోవడంతో.. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేదని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో ఆ వానాలను అదుపుచేయడం డైవర్లకు కష్టమైంది. దీంతోనే ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి హటాహుటిని చేరుకుని.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అందులో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటన్నదానిపై ఆరా తీసుకున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: