Home /News /crime /

BUS ACCIDENT 19 DIE AFTER BUS FALLS INTO RAVINE IN PAKISTAN PAH

ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది దుర్మరణం..

లోయలో పడిన బస్సు

లోయలో పడిన బస్సు

Pakistan: ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డానిసర్ సమీపంలో బస్సు అదుపు తప్పి రహదారిపై నుంచి లోయలో జారిపడింది. ఈ ఘటనలో 19 మంది సంఘటన స్థలంలోనే మరణించారు.

పాకిస్థాన్ లో (Pakistan)  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డానిసర్ సమీపంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కాగా, బస్సు రావల్పిండి నుంచి క్వెట్టాకు వెళుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డానిసర్ సమీపంలో అదుపుతప్పి (Road accident) లోయలో పడింది. దీంతో దానిలో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. బస్సులోని వస్తువులు చిందర వందరగా పడిపోయాయి. అక్కడ ప్రాంతామంతా భీతావహకంగా మారిపోయింది.

వెంటనే స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రమాదంపై అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్థానికులతో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అంబులెన్స్ లను తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 19 మంది మరణించారు. మరో 14 మందిని ఆస్పత్రికి తరలించారు.



ప్రమాదంపై గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా, అక్కడి రహాదారులు అత్యంత ఇరుకుగా ఉంటాయి. వీటిని అధికారులు.. సరిగ్గా నిర్వహించక పోవడం వలన రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగు తున్నాయి. అలాగే కొంత మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెలలో బలూచిస్థాన్‌లో మినీ బస్సు లోయలోకి పడిపోవడంతో 22 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్డు ప్రమాదాలు (Road Accident) రోజు రోజుకూ టెర్రర్ పుట్టిస్తున్నాయి.

రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట ఈ ప్రమాద వార్తలు వినాల్సి వస్తోంది. నిద్రమత్తు.. నిర్లక్ష్యమో.. అతి వేగమో ఏదో ఒక రూపంలో మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. కొండంత ఆశతో ప్రయాణాలు చేస్తున్న వారికి.. బస్సులే యమపాశంగా మారుతున్నాయి. వారి జీవితాలకు ముంగింపు పలికేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు (Road Accident) జరుగకుండా పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఒకరిద్దరి నిర్లక్ష్యానికి మరికొందరు బలి కావాల్సి వస్తోంది. డ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రమాదాలు (Accidents) జరుగుతున్నాయనే ప్రదేశాలను గుర్తించి అధికారులు.. అక్కడ హెచ్చరికల బోర్డులు పెట్టడకపోవడం. నిద్రమత్తులో వాహనాలు నడుపుతుండడం.. అతివేగం, మద్యం తాగి (Drunk and Drive) వాహనాలు నడపడం ఇలా పలు కారణాలతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాత్రి అనంతపురం జిల్లా (Anantapuram District) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. లారీ (Lorry)లో ఉన్న ఇద్దరు, బస్సు (Buss)లోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Pakistan, Road accident

తదుపరి వార్తలు