Home /News /crime /

BUREAUCRAT DETAINED IN JHARKHAND FOR MOLESTED AND HARASSING STUDENT PAH

విందులో కలెక్టర్ వంకర బుద్ధి.. సింగిల్ గా ఉన్న విద్యార్థిని దగ్గరకు వెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jarkhkand: ట్రైనీ ఇంజనీరింగ్ విద్యార్థులు పార్టీకి హజరయ్యారు. యువతి సింగిల్ గా ఉంది. ఐఏఎస్ అధికారి ఆమె దగ్గరకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

కొందరు తమ హోదాను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. కొన్ని చోట్ల అధికారులు పనికోసం వచ్చిన మహిళలను.. తమ లైంగిక కోరికలు తీరిస్తేనే... కావాల్సిన పనిచేస్తామంటూ బేరమాడుతుంటారు. మరికొందరు అధికారులు.. బాధితుల బలహీనతలను ఆసరాగా చేసుకొని.. గెస్ట్ హౌస్ కు రావాలని, ప్రేమపేరుతో, పెళ్లి చేసుకొవాలని బెదిరిస్తుంటారు. ఇలాంటి లైంగిక వేధింపులకు చెందిన అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది. డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. దీనికి జార్ఖండ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, కొంత మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు, మరికొంత మంది అతిథులు హజరయ్యారు. అందరు పార్టీలో హుషారుగా పాల్గోన్నారు. మద్యం తాగారు. అయితే, కలెక్టర్, విద్యార్థి సింగిల్ గా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను లైంగికంగా (harassment)  వేధించాడు.



అయితే, యువతి ఇంటికి వెళ్లి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో సోమవారం.. తనపై  కలెక్టర్ లైంగిక వేధింపులకు (female harassment) పాల్పడ్డాడని ఖుంటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పార్టీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పార్టీకి వచ్చిన ఇతరులకు కూడా విచారించారు. ప్రాథమికంగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమేనని వారు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో ఒక మహిళ రైలు ముందు పడి సూసైడ్ చేసుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi)  దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ జోర్ బాగ్ స్టేషన్ లో ఉన్న రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకుంది. రైలు కోసం వేచిచూస్తుంది. అక్కడ 50 ఏళ్ల మహిళ కూడా ఉంది. రైలు ప్లాట్ ఫామ్ మీదకు వస్తుంది. ఇంతలో మహిళ అందరు చూస్తుండగానే రైలు ముందుకు దూకేసింది. దీంతో ఆమె రైలు కింద (Suicide) పడింది. అక్కడున్న వారు ఒక్కసారిగా షాకింగ్ కు గురయ్యారు.

వెంటనే రైలును ఆపారు. ఆమెను అక్కడినుంచి బైటకు తీశారు. వెంటనే రైల్వే సిబ్బంది..ఆమెను.. ఢిల్లీలోని సప్థర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. ఆమె శవాన్ని మార్చూరీలో ఉంచారు. యువతి సూసైడ్ చేసుకొవడానికి గల కారణలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment, Jharkhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు