హోమ్ /వార్తలు /క్రైమ్ /

తుపాకీతో తలలో కాల్చుకున్న భర్త.. భార్య మెడలోకి దిగిన తూటా..

తుపాకీతో తలలో కాల్చుకున్న భర్త.. భార్య మెడలోకి దిగిన తూటా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిత్యావసర సరుకుల దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడే పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. లాక్‌డౌన్ నేపత్యంలో కొంతకాలంలో పని లేకపోవడంతో ఇంట్లోనూ ఉంటున్నాడు.

ఓ వ్యక్తి ఆవేశంలో తన తలలో తుపాకీతో కాల్చుకున్నాడు. బుల్లెట్ అతడి తలలో నుంచి పక్కనే ఉన్న తన భార్య మెడలోకి దిగింది. అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలు హరియాణాలో చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఐదు నెలల క్రితం హరియాణాలోని గురుగ్రామ్‌‌లోని రామ్‌పురాలో అద్దెకు ఉంటున్నాడు. ఇప్పటికే ఆ వ్యక్తి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే 2017 సంవత్సరంలో మొదటి భార్యతో విడిపోయి 2019 సంవత్సరంలో మధురకు మకాం మార్చాడు. అక్కడ ఒక నిత్యావసర సరుకుల దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడే పనిచేస్తున్న మరో మహిళతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. లాక్‌డౌన్ నేపత్యంలో కొంతకాలంలో పని లేకపోవడంతో ఇంట్లోనూ ఉంటున్నాడు. ఫలితంగా భార్యభర్తలిద్దరి మధ్య ఘర్షణ జరుగుతోంది.

ఇదిలావుంటే.. ప్రస్తుతం రెండో భార్య ఐదు నెలల గర్భిణీ కావడంతో ఆమెను కారులో వైద్య పరీక్షల కోసం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఉద్యోగం విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశంలో భర్త కారులో ఉన్న తుపాకీ తీసుకుని తన చెవిలో కాల్చుకున్నాడు. దీంతో బుల్లెట్ తలలో నుంచి బయటకు వచ్చి బుల్లెట్ పక్కనే ఉన్న అతడి భార్య మెడలోకి దూసుకెళ్లింది. కారులో రక్తపు మడుగులో పడి ఉన్న భార్యభర్తలిద్దరిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకుని వారిద్దరినీ ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా, భార్య మాత్రం ప్రాణప్రాయం నుంచి తప్పించుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Gun fire, Police

ఉత్తమ కథలు