హోమ్ /వార్తలు /క్రైమ్ /

Paritala Siddhartha: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం.. పరిటాల రవి కుమారుడిపై కేసు నమోదు..!

Paritala Siddhartha: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం.. పరిటాల రవి కుమారుడిపై కేసు నమోదు..!

పరిటాల సిద్ధార్థ

పరిటాల సిద్ధార్థ

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం రేపింది. టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్దార్థ బ్యాగులో 5.5 ఎంఎం బుల్లెట్ ఉన్నట్టుగా విమానశ్రయ భద్రత సిబ్బంది గుర్తించారు.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బుల్లెట్ కలకలం రేపింది. టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్దార్థ బ్యాగులో 5.5 ఎంఎం బుల్లెట్ ఉన్నట్టుగా విమానశ్రయ భద్రత సిబ్బంది గుర్తించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేపింది. వివరాలు.. పరిటాల సిద్దార్థ గురువారం శ్రీనగర్‌కు వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌పోర్ట్ అధికారులు.. స్క్రీనింగ్ సమయంలో అతని బ్యాగులో బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారని సమాచారం. అయితే తన బ్యాగులో బుల్లెట్ ఉందని, అందుకు అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిదార్థ చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఇక, ఎయిర్‌పోర్ట్‌ భద్రత సిబ్బంది.. సిదార్థ బ్యాగులో పట్టుబడ్డ బుల్లెట్‌ను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు పరిటాల సిద్ధార్థకు నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పరిటాల కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

First published:

Tags: Paritala sunitha, Shamshabad Airport

ఉత్తమ కథలు