BUILDING COLLAPSES IN SOUTH DELHIS SATYA NIKETAN 2 RESCUED CM KEJRIWAL SAYS MONITORING SITUATION PAH
Shocking: కుప్ప కూలిన నిర్మాణంలో భవంతి.. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురు కార్మికులు.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం..
కుప్పకూలీన భవంతి
Delhi: ఢిల్లీలో సోమవారం దారుణ ఘటన జరిగింది. సత్య నికేతన్ ప్రాతంలో నిర్మాణంలో ఉన్న భవంతి కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రజలు వేరే ప్రాంతాలకు పరుగులు తీశారు.
Building Collapses In Delhis at Satya Niketan: దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి కుప్పకూలింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్చలను ప్రారంభించారు. ఈ ఘటనలో శిథిలాల కింద ఐదుగురు వ్యక్తులు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరిని ఇప్పటికే ఫైర్ సిబ్బంది కాపాడారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
మరో ముగ్గురిని కాపాడటానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘటన స్థలం వద్ద అంబూలెన్స్ లను తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం చాలా బాధాకరం. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
ये हादसा बेहद दुखद है। ज़िला प्रशासन राहत और बचाव के काम में जुटा है। मैं ख़ुद घटना से सम्बंधित हर जानकारी ले रहा हूँ। https://t.co/dO8l2zEWon
ఘటనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను' అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అదే విధంగా, ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, స్థానిక అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
రైలు ప్రమాదాల చరిత్రలోనే అనూహ్య ఘటన ఆదివారం చెన్నై నగరంలో చోటు చేసుకుంది.
సాధారణంగా కొద్ది పాటి వేగంతో రైలు పట్టాలు తప్పినప్పుడు పక్కకు ఒరగడం, స్పీడు ఎక్కువగా ఉంటే బోగీలు ఒకదానిపై మరోటి పడిపోవడం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగిన ప్రమాదంలో మాత్రం రైలు పట్టాలు తప్పి, ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్ ఫామ్ ధ్వంసం కాగా, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది.
వివరాలివి.. తమిళనాడు రాజధాని చెన్నైలో విరివిగా తిరిగే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) లోకల్ రైళ్లకు సంబంధించి ఇవాళ ప్రమాద ఘటన జరిగింది. బీచ్ స్టేషన్ లో ఓ సబర్బన్ రైలు పట్టాలు తప్పి, ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు.
‘షెడ్ లైన్ నుంచి రైలు 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ వైపునకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బీచ్ స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్ 1 కొంత భాగం దెబ్బతినింది. రైలు ఖాళీగా ఉండటం, ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పినట్లయింద’ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు పేర్కొన్నారు. అయితే లోకో పైలట్(రైలు డ్రైవర్) మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆదివారం సెలవు కావడంతో ప్రయాణికుల రద్దీ లేదని, గాయపడ్డ రైలు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.