Home /News /crime /

BUILDING COLLAPSE TRAGEDY AT THANE IN MAHARASHTRA PAH

Building Collapse: పండుగ పూట విషాదం.. కుప్పకూలిన భవనం... ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..

కుప్ప కూలిన భవనం

కుప్ప కూలిన భవనం

Maharashtra: అప్పటి వరకు ఇంట్లో వారంత కుటుంబ సభ్యులతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా వారికి అనుకొని ఆపద ఎదురైంది. నిముషాల్లోనే తమ మధ్య ఆనందంగా ఉన్నవారు.. విగత జీవులయ్యారు.

Building Collapse tragedy at Thane: మహారాష్ట్ర పరిధిలో విషాదం చోటు చేసుకుంది. థానె  (Thane) పరిధిలో దారుణం జరిగింది. ఒక భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో.. ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. థానె పరిధిలోని ఒక ఇంట్లో పండుగ పూట జరగరాని ఘోరం జరిగిపోయింది. భవనం ఒక్కసారిగా కుప్పకూలీంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దుమ్ము లేచింది.

కాసేపు అక్కడ ఎంజరిగిందో ఎవరికి అర్ధం కాలేదు. ఎదైన బాంబు పేలిందో..లేదా సిలిండర్ ఎమైన బ్లాస్ట్ అయ్యిందా అని.. స్థానికులు భావించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే భవనం శిథిలాలను అక్కడి నుంచి తొలగించారు. శిథిలాలను (Building Collapse) జరిపి చూసిన అధికారులు షాకింగ్ కు గురయ్యారు. భవనం కింద పలువురు పడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు.





వెంటనే పోలీసులు ఘటన స్థలానికి అంబులెన్స్ లను పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు శిథిలాల కింద ఒక మహిళ చనిపోయి ఉండటాన్ని గమనించారు. అదే విధంగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన వారిని గుర్తించారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తెలంగాణ (Telangana)లో గతంలో ఒక ఘోరం జరిగింది.

హన్మకొండ (Hanmkonda) జిల్లాలో  రోడ్డు ప్రమాదం (Shocking Accident) చోటుచేసుకుంది. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో (Auto) ట్రాలీని ఇసుక లారీ (Lorry) ఢీకొట్టింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు (Three women Spot dead) అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పత్తిపాక గ్రామానికి చెందినవారని..

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి (MGM Hospital) తరలించారు. బాధితులు అంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మిరపకాయ కోతలకు వెళ్తుండగా ఈ ప్రమాదం (Shocking Accident) జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు రేణుక (Renuka), మంజుల (manjula), నిర్మల (Nirmala)లగా పోలీసులు గుర్తించారు. ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టడంతో బయపడి డ్రైవర్​ (driver)పరారైనట్లు కూలీలు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో శరీర అవయవాలు తెగి రోడ్డు మీద పడ్డాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Building Collapse, Crime news, Maharashtra

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు