హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: భార్యను తీసుకెళ్లి స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Shocking: భార్యను తీసుకెళ్లి స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త..ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 Man Gets Wife Raped : భార్యా-భర్తలు ఎలా ఉండాలంటే..ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు,నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. మొత్తంగా భర్యా-భర్తలు కలకాలం కలిసి మెలిసి ఉండాలి. ఎలాంటి

Man Gets Wife Raped : భార్యా-భర్తలు ఎలా ఉండాలంటే..ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు,నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. మొత్తంగా భర్యా-భర్తలు కలకాలం కలిసి మెలిసి ఉండాలి. ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకుసాగాలి. అయితే తాజాగా ఓ భర్త చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది. శత్రువులను ఇరికించాలనే దురుద్దేశంతో సొంత భార్యపైనే స్నేహితుడితో అత్యాచారాం చేయించాడు ఓ భర్త. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని బదౌన్ లో ఆదివారం ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని బదౌన్ లో నివసించే వ్యక్తికి ఇటీవల వివాహం అయింది. అయితే అదే ఏరియాలో నివసించే కొందరితో అడితో గొడవలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా వారిపై పగ తీర్చుకుందామా అన అనుకుంటుండేవాడు. అయితే ఎన్ని రోజులు ఎదురుచూసినా అవకాశం రాకపోవడంతో తానే ఛాన్స్ తీసుకొని తన శత్రువులను ఇరికించాలనుకున్నాడు. ఈ క్రమంలో అతడి మనసులో ఓ ఆలోచన వచ్చింది. తన శత్రువులతో తన భార్యపైనే అత్యాచారం చేయించి వారిని ఇరికించాలని ఫ్లాన్ చేశాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నిందితుడు తన భార్య(22)ను సహస్వాన్​ ప్రాంతంలోని అడవికి బైక్​ పై తీసుకెళ్లాడు. అనంతరం స్నేహితుడిని ఫోన్ చేసి పిలిచి అతడితో కలిసి రెండు సార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్​ చేసి తన భార్యపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కంప్లెయింట్ చేశాడు. అయితే దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా..బాధితురాలు అసలు విషయం వెల్లడించింది. . తన భర్త తమ గ్రామంలో ఇద్దరు వ్యక్తులను ఈ కేసులో ఇరికించాలని ఇలా చేశాడని తెలిపింది. వారితో గొడవలు కారణంగానే పగ తీర్చుకునేందుకు ఇలా చేశాడని పేర్కొంది. బాధితురాలి భర్త, అతని స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తను అదుపులోకి తీసుకున్నామని, రెండో వ్యక్తి కోసం గాలిస్తున్నామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP)రూరల్ సిద్ధార్థ్ వర్మ తెలిపారు.

ALSO READ Fine For Car Owner : ఇదెక్కడి ఘోరం రా అయ్యా.. కారు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్

మరోవైపు,స్నేహితుడితో కలిసి 9ఏళ్ల వయస్సు ఉన్న కన్నకూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన అవమానవీయ ఘటన ఛత్తీస్ గఢ్ లో వెలుగుచూసింది.  ఛత్తీస్​ గఢ్​ రాష్ట్రంలోని జష్​ పుర్​ లోని నారాయణ్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసించే ఓ వ్యక్తికి ఇద్దరు కుమారులు,ఓ కూతురు ఉంది 2019లో అతడి భార్య చనిపోవడంతో పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వగా, పిల్లలను తండ్రి వద్దకు తీసుకొచ్చింది అమ్మమ్మ. అయితే మద్యానికి బానిసైన తండ్రి ఏప్రిల్ 28న రాత్రి మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చి మూడేళ్లు, ఆరేళ్ల వయసున్న తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి నిద్రపోతున్న తొమ్మిదేళ్ల కూతురిని స్నేహితుల సహకారంతో పక్క గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి(Father Raped Daughter) పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన అనంతరం బాలిక తమ అమ్మమ్మకు సమాచారం అందించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు..బాలికపై అత్యాచారానికి పాల్పడిన తండ్రితో సహా ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.

First published:

Tags: Rape on women, Uttar pradesh, Wife and husband

ఉత్తమ కథలు