Home /News /crime /

BTECH STUDENT IN HYDERABAD COMMITTED SUICIDE AND THE DECEASED FATHER ALLEGED THAT A TRS CORPORATOR WAS INVOLVED IN THE SUICIDE PRV

BTech Student Suicide: హైదరాబాద్​లో ఇంజనీరింగ్​ విద్యార్థి ఆత్మహత్య.. అధికార పార్టీ నేత ప్రమేయంపై అనుమానాలు?

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

హైదరాబాద్​లోని బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఆత్మహత్య వెనుక అధికార పార్టీ నేత ప్రమేయం ఉన్నట్లు మృతుడి తండ్రి ఆరోపించాడు. వివరాలివే..

    హైదరాబాద్​లోని (Hyderabad) బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి (BTech Student Suicide) పాల్పడ్డాడు. ఈరంకి శరత్ వంశీ గౌడ్ అనే యువకుడు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శరత్​ వంశీ గౌడ్​ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే వంశీ గౌడ్ (Vamshi Goud) మృతికి స్థానిక కార్పొరేటర్​ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశీ గౌడ్ తండ్రి నరసింహగౌడ్ మాట్లాడుతూ..స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ (TRS Corporator) సుక్క శివకుమార్, అతని సోదరుడు తన కుమారుడిపై దాడి చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడని ఆయన ఆరోపించారు.

    ఏం జరిగింది?

    మామిడిపల్లిలో వాటర్ ట్యాంకర్ పై నీటి సరఫరా చేస్తున్న నరసింహాగౌడ్.. నెల రోజుల క్రితం బోరు వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. బాగు చేసేందుకు రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళాడు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో మోటార్ వద్ద కరెంటు పని చేస్తున్నాడు నరసింహాగౌడ్. అదే సమయంలో టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివకుమార్..అతని సోదరుడు శ్రీకాంత్..పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చదును చేస్తున్నారు. అయితే నరసింహాగౌడ్ చేతిలో వెలుగుతున్న సెల్ ఫోన్ లైట్ ను చూసిన కార్పొరేటర్ శివకుమార్..అతని వద్దకు వచ్చి..తమను వీడియో తీస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అలాంటిదేం లేదని చెప్పాడు నరసింహా. అయితే అతను చెప్పేది పట్టించుకోలేదు.

    ఇద్దరి మధ్య వాగ్వాదం..

    వినకుండా కార్పొరేటర్ శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ కలిసి నరసింహాగౌడ్ పై దాడికి యత్నించారు. అయితే నరసింహాగౌడ్ జరిగిన విషయాన్నీ తన కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించాడు. నరసింహాగౌడ్ కుమారుడు శరత్ వంశీ గౌడ్ (Sarath Vamshi Goud)వెళ్లి కార్పొరేటర్ సుక్క శివకుమార్ ను తన తండ్రిపై జరిగిన దాడిని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఈ వాగ్వాదం చూసిన శరత్​ తండ్రి భయపడిపోయాడు. తన కుమారుడిని ఏదైనా చేస్తారేమోనని సందేహించాడు.

    మే 27న కార్పొరేటర్ సోదరుడి దాడి..

    దీంతో కార్పొరేటర్ సుక్క శివకుమార్ అతని సోదరుడు శ్రీకాంత్ నుంచి తమ కుమారుడికి ప్రాణహాని ఉందంటూ నరసింహాగౌడ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఫిర్యాదును తీసుకోలేదని బాధితుడి తండ్రి చెప్పాడు. అయితే ఈ క్రమంలోనే శరత్ వంశీ గౌడ్ పై  మే 27న కార్పొరేటర్ సోదరుడు శ్రీకాంత్..దాడికి పాల్పడ్డాడు. ఈ అవమాన భారం భరించలేకనే.. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని నరసింహాగౌడ్ వాపోయారు. అయితే దాడి ఘటనలపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ చెప్పారు.

    ఆరోపణల్లో వాస్తవం లేదు

    ‘‘శరత్ వంశీ గౌడ్ ఆత్మహత్యతో మాకు సంబంధం లేదు. అతని కుటుంబం, వ్యక్తిగత సమస్యలు ఇందుకు కారణం కావచ్చు. నేను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదు. మాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు’’ టీఆర్ఎస్ కార్పొరేటర్ సుక్క శివ కుమార్ తెలిపాడు. అయితే ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: College student, Engineering, Hyderabad, Student suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు