• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • BTECH GRADUATE HAS BEEN ARRESTED ON CHARGES OF KIDNAPPING A SEVEN MONTH OLD BOY FOR A RANSOM WORTH RS 40 LAKH SSR

Lovers: బీటెక్ చేశాడు.. లవర్‌కు ఖర్చు పెట్టేందుకు డబ్బుల్లేక ఎంతపని చేశాడంటే...

Lovers: బీటెక్ చేశాడు.. లవర్‌కు ఖర్చు పెట్టేందుకు డబ్బుల్లేక ఎంతపని చేశాడంటే...

నిందితుడు కుమార్

యువకుడు బీటెక్ పూర్తి చేసి సాహిబాబాద్‌లో అప్రెంటిస్‌షిప్ చేస్తున్నాడు. కుమార్, ఓ యువతి కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఆ యువతిని కలిసినప్పుడల్లా, బయటకు తీసుకెళ్లినప్పుడల్లా ఆమె అవసరాలకు కుమారే ఖర్చుపెట్టాల్సి వచ్చేది. కొద్దిరోజులుగా ఆమె అవసరాలకు...

  • Share this:
    న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన ఓ ఘటన పోలీసులను నివ్వెరపోయేలా చేసింది. ప్రియురాలితో కలిసి జీవితంలో స్థిరపడేందుకు ఓ వ్యక్తి ఏడు నెలల పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. పోలీసులు కిడ్నాప్ జరిగిన ఏడు గంటల్లోనే కేసును చేధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కుమార్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి సాహిబాబాద్‌లో అప్రెంటిస్‌షిప్ చేస్తున్నాడు. కుమార్, ఓ యువతి కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే.. ఆ యువతిని కలిసినప్పుడల్లా, బయటకు తీసుకెళ్లినప్పుడల్లా ఆమె అవసరాలకు కుమారే ఖర్చుపెట్టాల్సి వచ్చేది. కొద్దిరోజులుగా ఆమె అవసరాలకు డబ్బు సర్దడం కుమార్‌కు ఇబ్బందిగా మారింది. స్నేహితుల వద్ద అందినకాడికి అప్పులు చేసిన కుమార్‌కు ఇంక ప్రియురాలి అవసరాలు తీర్చేందుకు కావాల్సిన డబ్బు కోసం ఏం చేయాలో పాలుపోలేదు. ఆ క్రమంలోనే.. ప్రియురాలి కోసం తప్పుదోవ పట్టాడు. ఆమెతో కలిసి ఎలాగైనా స్థిరపడాలన్న ఆలోచనతో అతను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొడుకైన ఏడు నెలల పిల్లాడిని కిడ్నాప్ చేశాడు. ఆ పిల్లాడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇస్తే పిల్లాడిని వదిలేస్తామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగింది. శివి కౌశిక్ అనే మహిళ తన ఏడు నెలల బాబు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయం నుంచి తన బాబు కనిపించడం లేదని, తమ ఇంట్లో అద్దెకు ఉండే ప్రియాన్షు కుమార్ పిల్లాడితో ఆడుకుంటున్నట్లుగా కొద్దిసేపు తమ ఇంట్లోనే ఉన్నాడని.. వేరే గదిలోకి తాను వెళ్లి వచ్చే సరికి కుమార్ పిల్లాడిని ఎత్తుకెళ్లిపోయాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికి కుమార్ ఆ పిల్లాడి తండ్రికి ఫోన్ చేసి రూ.40 లక్షలిస్తే పిల్లాడిని వదిలేస్తానని ఫోన్ చేశాడు.

    అంతేకాదు.. తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసిన కుమార్ డబ్బు ఏర్పాటు చేయాలని పిల్లాడి తల్లిదండ్రులకు చెప్పమని సలహా ఇచ్చాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. కుమార్ పిల్లాడిని తీసుకుని ఉత్తమ్ నగర్ వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల్లో తేలింది. కుమార్‌ మొబైల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. పిల్లాడిని కిడ్నాప్ చేసిన ప్రాంతం నుంచి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన కుమార్ అక్కడి నుంచి ట్యాక్సీ బుక్ చేసుకుని ఘజియాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.

    ఘజియాబాద్‌కు వెళ్లిన పోలీసు బృందం వసుంధర ప్రాంతంలో ఓ వ్యక్తి నెలల వయసున్న పిల్లాడితో ట్యాక్సీ దిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ట్యాక్సీని ఛేజ్ చేసి పంఖ రోడ్‌లో నిలువరించినట్లు డీసీపీ తెలిపారు. కుమార్‌ను అదుపులోకి తీసుకుని పిల్లాడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. ప్రియురాలికి ఖర్చుపెట్టేందుకు పిల్లాడినే కిడ్నాప్ చేసిన కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో అతని ప్రియురాలి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: