హోమ్ /వార్తలు /crime /

బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..

బీటెక్ కుర్రాడు.. డిగ్రీ యువతి.. రాత్రి 10.30గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ ఆ యువతి బయటకు వచ్చి..

సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ బయటికి వెళ్లిన ఇందు మళ్లీ తిరిగి రాలేదు. రాత్రి ఇంటి నుంచి బయటకి వచ్చి ఇందు, విష్ణును కలిసింది. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రే..

    క్షణికావేశంలోనే యువత దారుణ నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారనో , ఉపాధ్యాయులు కోప్పడ్డారన్న కారణాలతో ఎన్నో ఘోరాలు జరిగాయి. ప్రేమ విషయంలో కూడా యువత తొందరపాటు నిర్ణయాలే తీసుకుంటోంది. ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తితో చనువుగా ఉంటోందన్న కారణంతో గుంటూరులో ఓ కుర్రాడు ఆమెను హతమార్చాడు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో సూర్యాపేట జిల్లాలోని కోదాడలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. బీటెక్ చదువుతున్న కుర్రాడు, డిగ్రీ చదువుతున్న యువతి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు గ్రామానికి చెందిన భవనం విష్ణువర్ధన్ రెడ్డి అనే 22 ఏళ్ల కుర్రాడు స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒంగోలు సిటీలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన నాగినేని ఇందు అనే 18 ఏళ్ల యువతి సిటీలోనే ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. వీళ్లిద్దరికీ ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితికి చేరింది. అయితే వీరి విషయం ఇళ్లల్లో తెలిసిందో, తల్లిదండ్రులు మందలించారో ఏమో కానీ సోమవారం రాత్రి దారుణానికి పాల్పడ్డారు.

    ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..

    సోమవారం ఉదయం కాలేజీకి అని వెళ్లిన విష్ణు తిరిగి ఇంటికి రాలేదు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో పాల ప్యాకెట్ తీసుకొస్తానంటూ బయటికి వెళ్లిన ఇందు మళ్లీ తిరిగి రాలేదు. రాత్రి ఇంటి నుంచి బయటకి వచ్చి ఇందు, విష్ణును కలిసింది. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రే సూరారెడ్డి పాలేం రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. నడుచుకుంటూ కాస్త ముందుకు వెళ్లి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం పూట ఈ దారుణాన్ని చూసిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి దాటిన తర్వాతే వాళ్లు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి శరీర భాగాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు పంపించారు. యువతీయువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

    ఇది కూడా చదవండి: రాజీవ్‌తో ప్రేమ పెళ్లికి ఒకే ఒక్క కండీషన్ పెట్టిన దేవదాస్ కనకాల.. నేరుగా సుమ ఫోన్ చేసి చెప్తే..

    First published:

    ఉత్తమ కథలు