news18-telugu
Updated: June 29, 2020, 10:10 AM IST
ప్రతీకాత్మక చిత్రం
యాదాద్రిభువనగిరి జిల్లాలో ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మృతిచెంది పడి ఉండడం కలకలం సృష్టించింది. అయితే సదరు ఉద్యోగిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ పట్టణానికి చెందిన షణ్ముఖచారి పట్టణంలోనే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం సమీపంలోని గణేష్ వెంచర్లో షణ్ముఖచారి అనుమానాస్పదస్థితిలో తన సొంతకారులో మృతిచెంది ఉన్నాడు. చారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
ఇదిలావుంటే.. చారి మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు అక్కడ కన్పిస్తున్న నేపథ్యంలో పోలీసుల అనుమానాస్పద మృతి కోణంలో విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు షణ్ముఖ చారిది హత్యానా? లేక ఆత్మహత్య? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
First published:
June 29, 2020, 10:10 AM IST