హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: హాస్టల్ గదిలో అర్థరాత్రి ఆమె చేసిన పనికి అందరూ షాక్.. ఏం జరిగిందంటే..

Shocking: హాస్టల్ గదిలో అర్థరాత్రి ఆమె చేసిన పనికి అందరూ షాక్.. ఏం జరిగిందంటే..

ఆయుష్ (ఫైల్)

ఆయుష్ (ఫైల్)

Shocking: కాలేజీలో స్నేహితుల మధ్య చిన్న చిన్న వివాదాలు సహజమే. ఇలా గొడవలు పెట్టుకొని మరుసటి రోజు అలా కలిసిపోతారు. కానీ ఇక్కడ చెప్పుకొనే ఇద్దరు యువతులు గత ఏడు నెలలుగా గొడవలు పడుతూనే ఉన్నారు. అందులో ఓ యువతి తీసుకున్న నిర్ణయానికి అందరూ షాక్ అయ్యారు.

ఇంకా చదవండి ...

కాలేజీలో స్నేహితుల(College Friends) మధ్య చిన్న చిన్న వివాదాలు సహజమే. ఇలా గొడవలు పెట్టుకొని మరుసటి రోజు అలా కలిసిపోతారు. కానీ ఇక్కడ చెప్పుకొనే ఇద్దరు యువతులు(Two Girls) గత ఏడు నెలలుగా గొడవలు పడుతూనే ఉన్నారు. వారిద్దరినీ పిలిపించిన కాలేజీ యాజమాన్యం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ రోజు వరకు బాగానే ఉన్నా మరుసటి రోజు నుంచి గొడవ మళ్లీ షురూ చేసేవాళ్లు. ఇలా వారిద్దరి మధ్య ఏదో ఒక గడవ జరుగుతూనే ఉండేది. దీంతో విస్తుపోయిన కాలేజీ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది. వారిద్దరినీ కాలేజీకి సంబంధించి హాస్టల్లో అది కూడా ఒకే గదిలో ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకే గదిలో ఉంటే.. వారిద్దరి మధ్య గొడవలు తగ్గి.. స్నేహం ఏర్పడుతుందని భావించారు.

Love Marriage: ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్.. ఇదేం బుద్ది మరి.. అలాంటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు..


కానీ ఇక్కడే కాలేజీ యాజమాన్యం పొరపాటు చేసింది. గొడవలు తగ్గకపోగ ఇంకా పెరిగాయి. దీంతో వాళ్లిద్దరిలో ఒకరు ప్రాణాలు తీసుకునే దాక వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా వెల్లడించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లా కోట్ పుట్లీ ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే కారు డ్రైవర్ కు 22 ఏళ్ల ఆయుష్ అనే కూతురు ఉంది. ఆమె సర్దార్ పటేల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇల్లు కాలేజీకి దూరంగా ఉండటంతో ఆక్కడే హాస్టల్ లో ఉండి చదువుతోంది. ఆమెకు అదే కాలేజీకి చెందిన చందా ప్రజాపత్ అనే యువతి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ద్వేషంగా మారింది. ఏడు నెలలుగా వాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ.. ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వాళ్లిద్దరి పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

Shocking Incident: కన్నతల్లి అని కూడా చూడలేదు.. వాటి కోసం కొడుకు ఏం చేశాడో చూడండి..


అయినా వారిద్దరి తీరు మారలేదు. దీంతో ఆ యువతులిద్దరు ఇంకెప్పుడు గొడవపడకూడదని కాలేజీ యాజమాన్యం ఓ నిర్ణయానికొచ్చింది. వారిద్దరు హాస్టల్‌లో ఒకే గదిలో ఉంటే మారుతారని భావించింది. ఇద్దరిని హాస్టల్ లోని ఒకే గదిలో ఉండమన్నారు. అయితే ఇక్కడ రాత్రిపూట చందా ప్రజాపత్ కు చదివే అలవాటు ఉంది. ఆయుష్ కు మాత్రం ఉదయం చదివే అలవాటు ఉంది. అయితే ప్రజాపత్ చదువుతున్న సమయంలో లైట్ వేసేది. దానికి ఆయుష్ లైట్ ఉంచడం వల్ల తనకు నిద్ర రావడం లేదని.. ఉదయం లేచి చుదువుకొమ్మని ఆయుష్ ఆమెకు చెప్పేది. కానీ ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య లైట్స్ విషయంలో గొడవలు మొదలయ్యాయి. ఇలా రాత్రంతా అలా లైటింగ్ వెలుతురులో పడుకోవడం వల్ల ఆయుష్‌కు మైగ్రేన్ సమస్య తలెత్తింది. దీంతో ఆయుష్ తీవ్ర మనోవేదనకు గురైంది.

Bigg Boss 5 Telugu: భారీగా పడిపోయిన షణ్ముఖ్ గ్రాఫ్.. నంబర్ వన్ స్థానంలోకి వచ్చిన మరో కంటెస్టెంట్..


చివరికి ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గదిలో చందా ప్రజాపత్ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. తన కూతురు చావుకు కారణం ప్రజాపత్ అంటూ ఆమె తండ్రి ఆరోపించాడు. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నామని.. ఆయుష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చందా ప్రజాపత్‌కు, మరో విద్యార్థిని నహర్ సింగ్‌కు వీడియో కాల్ చేసిందని.. ఇదంతా ఆమె కాల్ రికార్డ్స్‌ ద్వారా తెలిసిందని తెలిపారు. వారితో ఏం మాట్లాడిందనే విషయాన్ని పోలీసులు కనుక్కొనే పనిలో పడ్డారు.

First published:

Tags: Attempt to suicide, Nursing

ఉత్తమ కథలు