BSY Soundarya : శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో సౌందర్య భర్య నీరజ్ డ్యూటీకి వెళ్లారు. సౌందర్య తన బాబుతో కలిసి ఇంట్లోనే ఉంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో అపార్ట్ మెంటుకు వచ్చిన పనిమనిషి ఎంతకూ లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో
Yadiyurappa's Granddaughter : కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యడియూరప్ప మనవరాలు సౌందర్య(30) బెంగళూరులోని వసంతనగరలోని తన అపార్ట్ మెంట్ లో శుక్రవారం ఫ్యాన్ కు వేలాడుతూ ఉండటాన్ని గుర్తించిన బంధువులు వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే సౌందర్య మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్ కి తరలించి.. దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
యడియూరప్ప కుమార్తె అయిన పద్మావతి కూతురు సౌందర్య. వృత్తి రీత్యా డాక్టర్ అయిన సౌందర్య బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. 2018లో సౌందర్య.. డాక్టర్ నీరజ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు. గత రెండేళ్లుగా వీళ్లు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతనగరలో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో సౌందర్య భర్య నీరజ్ డ్యూటీకి వెళ్లారు. సౌందర్య తన బాబుతో కలిసి ఇంట్లోనే ఉంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో అపార్ట్ మెంటుకు వచ్చిన పనిమనిషి ఎంతకూ లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో సౌందర్య భర్త నిరంజన్ కు సమాచారం ఇచ్చారు.
ఆయన వెంటనే ఫోన్ కాల్ చేసినప్పటికీ సౌందర్య నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తన దగ్గర ఉన్న మరో తాళంతో తలుపులు తీశారు. సౌందర్య ఉరివేసుకొని కనిపించడంతో ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే బాబుకు జన్మనిచ్చిన తర్వాత సౌందర్య డిప్రెషన్లోకి వెళ్లారని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని, వారి మధ్య ఎలాంటి కలహాలు లేవని ఇంట్లోని పనివారు చెప్పినట్లు తెలిపారు.ఆయితే, ఘటనా స్థలంలో ఎలాంటి సూసైట్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. సౌందర్య కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయినందున వారిని తాము ప్రశ్నించలేకున్నామని, అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత కేసు సమగ్ర దర్యాప్తు జరుపుతామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.