యువతికి మత్తు మందు ఇచ్చి.. నగ్న వీడియోలు తీసి.. ఆపై ఎంత పనిచేశారంటే..

ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు కౌశిక్, వరుణ్‌లు తమ తోటి విద్యార్థినికి మూడు సంవత్సరాల క్రితం కూల్ డ్రింక్‌లో మత్తమందు కలిపి ఇచ్చారు.

news18-telugu
Updated: June 28, 2020, 6:53 AM IST
యువతికి మత్తు మందు ఇచ్చి.. నగ్న వీడియోలు తీసి.. ఆపై ఎంత పనిచేశారంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు. ఒకే కాలేజీ కావడంతో స్నేహితులుగా ఉండేవారు. అయితే ఓ ఇద్దరు విద్యార్థులు తమ తోటి విద్యార్థినిపై కన్నేశారు. ఆమెకు మూడు సంవత్సరాల క్రితం కూల్ డ్రింక్‌లో మత్తమందు కలిపి ఇచ్చారు. అనంతరం నగ్న వీడియోలు తీసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుంుటూరు జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు కౌశిక్, వరుణ్‌లు తమ తోటి విద్యార్థినికి మూడు సంవత్సరాల క్రితం కూల్ డ్రింక్‌లో మత్తమందు కలిపి ఇచ్చారు.

ఆ యువతి స్పృహ కోల్పోగానే లైంగిక దాడి చేసి నగ్న వీడియోలు తీశారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. ఓసారి వాటిని నెట్‌లో తాత్కాలికంగా పెట్టి డిలీట్ చేశారు. ఓ యువకుడికి సైతం సదరు యువతి వేరొకరితో సన్నిహితంగా ఉందంటూ వీడియోలను చూపించారు. యువతికి మెయిల్స్ పెట్టి తరచూ బెదిరింపులకు పాల్పడ్డారు.

చివరకు నగ్న వీడియోలను పోర్న్ సైట్లలోనూ పెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన దిశ పోలీసులు కౌశిక్, వరుణ్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
First published: June 28, 2020, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading