అక్కడ ‘గే’ కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు... ఆ సంబంధం పెట్టుకున్నా అంతే...

స్వలింగ సంపర్కులు కనిపించినా, భర్తాభార్యలను మోసగించి వివాహేతర సంబంధం పెట్టుకున్నా రాళ్లతో కొట్టి చంపేస్తారు.. దొంగతనం చేసి మొదటిసారి దొరికితే చేతి, రెండోసారి దొరికితే కాలు నరికివేత...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 3, 2019, 9:09 PM IST
అక్కడ ‘గే’ కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు... ఆ సంబంధం పెట్టుకున్నా అంతే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత సుప్రీంకోర్టు. సెక్షన్ 377ను రద్దుచేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరిచిన తీర్పుతో దేశంలో ఎంతో మంది స్వలింగ సంపర్కులు సంతోషం వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధం నేరం కాదంటూ సెక్షన్ 497ను కొట్టి వేసినప్పుడు ఎంత మంది డ్యాన్సులు చేశారో చెప్పనక్కరం లేదు. అయితే ఆసియాలోని ఓ చిన్నదేశం అయిన బ్రూనైలో మాత్రం ఇకపై ఇలాంటివి చెల్లవు. స్వలింగ సంపర్కులు కనిపించినా, భర్తాభార్యలను మోసగించి వివాహేతర సంబంధం పెట్టుకున్నా రాళ్లతో కొట్టి చంపేస్తారు. ముస్లిం మెజారిటీ ఉన్న బ్రూనైలో షరియా చట్టాల ప్రకారం శిక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ దేశ అధికారులు. ఏప్రిల్ మొదటి వారం (ఏప్రిల్ 3) నుంచే బ్రూనైలో ఈ చట్టం అమలులోకి రానుంది. దీని ప్రకారం స్వలింగ సంపర్కం పెట్టుకున్నవారు కనిపించినా... వివాహేతర సంబంధం పెట్టుకున్నవారు కనిపించినా... వారిని జనాలందరి ముందు నిలబెట్టి చచ్చేదాకా రాళ్లతో కొట్టి హింసిస్తారు. అలాగే దొంగతనం చేసినా సరే కఠిన శిక్షలు అనుభవించేందుకు సిద్ధంగా ఉండాలి.
Bruneian, Brunei, Gay sex crime, Lesbian Sex crime, adultery crime, amputation of Hand, foot amputation for theft, cruel punishment for thefts, cruel crime punishment in Brunei, బ్రూనై, గే సెక్స్, లెస్బియన్ సెక్స్, స్వలింగ సంపర్కం, సెక్షన్ 377, దొంగతనం చేస్తే కాళ్లు చేతులు నరికేస్తారు, బ్రూనై శిక్షలు, వివాహేతర సంబంధం పెట్టుకుంటే అంతే, అక్రమ సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు
చట్టాలను వ్యతిరేకిస్తూ భారీఎత్తున నిరసన కార్యక్రమాలు (REUTERS)

దొంగతనం చేసి మొదటిసారి దొరికితే ఆ పనిచేసేందుకు ఉపయోగించిన చేతిని నరికేస్తారు. అయినా మళ్లీ దొంగతనానికి పాల్పడితే... కాలు కూడా నరికేస్తారు. సౌదీ అరేబియా వంటి దేశాల్లో మాత్రమే ఇలాంటి కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయి. సౌదీని ఆదర్శంగా తీసుకుని బ్రూనై కూడా షరియా చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఆగ్రేయ ఆసియాలో ఇలాంటి శిక్షలు అమలులోకి తెచ్చిన మొదటి దేశంగా బ్రూనై గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని మానవహక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలు మానవ స్వేచ్ఛను హరించేవిగా ఉన్నాయని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. ఈ శిక్షల కారణంగా దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి, విదేశీ పెట్టుబడులు భారీగా పడిపోతాయని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం నేరాలు అదుపులో ఉండాలనే కఠినమైన శిక్షలు అమలు చేయడం తప్పనిసరి అని సమర్థించుకుంటున్నారు. అయితే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు బ్రూనై వాసులు.
First published: April 3, 2019, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading