భార్యను తీసుకుని రమ్మన్నందుకు.. తమ్ముడిని ఉరేసి చంపిన అన్న

మద్యం మత్తులో ఉన్న మునావర్ గదిలోకి వెళ్లిన షాహిద్.. మునావర్ కాళ్లు చేతులు కట్టేసి తాడుతో మెడకు ఉరేసి చంపేశాడు. అనంతరం ఆ విషయాన్ని షాహిద్.. రెండో తమ్ముడైన ఖలీద్‌కు చెప్పాడు.

news18-telugu
Updated: May 27, 2020, 6:50 AM IST
భార్యను తీసుకుని రమ్మన్నందుకు.. తమ్ముడిని ఉరేసి చంపిన అన్న
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. సొంత తమ్ముడినే అన్న ఉరేసి చంపిన ఘటనిది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డినగర్‌లో ఉండే మునావర్(33) పది సంవత్సరాల క్రితం ఉప్పల్‌కు చెందిన కల్పనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే మునావర్ నిత్యం మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తన భార్యకు నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలంటూ తన ముగ్గురు అన్నలతో మునావర్ తరచూ గొడవకు దిగేవాడు. వారం క్రితం తన పెద్ద అన్నయ్య షాహిద్(45)తో గొడవ పడ్డాడు. దీనికితోడు షాహిద్ కూతురు(12)తో అసభ్యంగా ప్రవర్తించడంతో మునావర్‌ను ఏలాగైనా చంపాలని పథకం వేశాడు. మంగళవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న మునావర్ గదిలోకి వెళ్లిన షాహిద్.. మునావర్ కాళ్లు చేతులు కట్టేసి తాడుతో మెడకు ఉరేసి చంపేశాడు. అనంతరం ఆ విషయాన్ని షాహిద్.. రెండో తమ్ముడైన ఖలీద్‌కు చెప్పాడు. ఖలీద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పారిపోయిన షాహిద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
First published: May 27, 2020, 6:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading